ఇంగ్లండ్‌లో జరుగుతున్న వైటాలిటీ బ్లాస్ట్ లీగ్‌లో ఓ బ్యాటర్ అడిన షాట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సదరు బ్యాటర్ వినూత్నమైన షాట్‌తో బంతిని బౌండరీ తరలించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇదెక్కడి షాట్ రా అయ్యా.. రివర్స్ స్కూప్ అనలా? రివర్స్ స్విచ్ అనలా? అని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా బ్యాటర్ సమయస్ఫూర్తి, టైమింగ్ అద్భుతమని కొనియాడుతున్నారు.
వైటాలిటీ బ్లాస్ట్ లీగ్‌లో భాగంగా సర్రెతో జరిగిన మ్యాచ్‌లో మిడిల్సెక్స్ బ్యాటర్ ల్యూక్ హాల్మన్ ఈ వినూత్న షాట్ ఆడాడు. గత బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో సామ్ కరన్ వేసిన 19వ ఓవర్‌లో ల్యూక్ హాల్మన్ చాకచక్యంగా బౌండరీకి తరలించారడు. బాల్ వేసే సమయంలో స్టాన్స్ మార్చుకున్న ల్యూక్.. స్లో బాల్ వేయడం గమనించి పొజిషన్‌ను మార్చుకొని బౌండరీ తరలించాడు. దాంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

అయితే ఈ మ్యాచ్‌లో సర్రే 8 పరుగుల తేడాతో గెలుపొందింది. ల్యూక్ హాల్మన్(32 నాటౌట్) అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సర్రే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది. విల్ జాక్స్(36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. టామ్ కరణ్(22 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 47) హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. అనంతరం మిడిల్సెక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 181 పరుగులకే పరిమితమైంది.