Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇది నా కెరీర్‌లోనే బెస్ట్ క్యాచ్: శుభ్‌మన్ గిల్

తన క్రికెట్‌ కెరీర్‌లో ఇప్పటి వరకు అద్భుతమైన క్యాచ్‌లు అందుకోలేదని, ఆ కోరిక తాజా మ్యాచ్‌తో నెరవేరిందని టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంతోషం వ్యక్తం చేశాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

అయితే ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. హర్ష్‌దూబే బౌలింగ్‌లో అల్లాగజన్‌ఫర్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో మెరుపు వేగంతో ఒడిసిపట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌కే ఈ క్యాచ్ హైలైట్‌గా నిలిచింది.

ఇది టీ20 తరహా మ్యాచ్..

ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన శుభ్‌మన్ గిల్.. సమష్టి ప్రదర్శనతోనే విజయం సాధ్యమైందని తెలిపాడు. 'ఇది దాదాపు టీ20 మ్యాచ్ తరహాలోనే సాగింది. మేం ఈ మ్యాచ్‌ను అద్భుతంగా ప్రారంభించినా.. గుర్భాజ్ అద్భుతమైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. కానీ మేం కీలక సమయంలో పుంజుకొని గట్టి పోటీ ఇచ్చాం.

Middle Overs Are Crucial Shubman Gill Decodes India s Winning Strategy Against Afghanistan in 1st ODI

ఇది బ్యాటింగ్‌కు అద్భుతమైన వికెట్. మేం బౌలింగ్ చేస్తున్నప్పుడు పిచ్ కొద్దిగా గ్రిప్ అయ్యింది. కానీ మా బ్యాటింగ్ సమయంలో మాత్రం బంతి ముద్దుగా బ్యాట్‌పైకి వచ్చింది. స్లిప్ క్యాచ్‌లను నేను బాగా ప్రాక్టీస్ చేశాను. నా కెరీర్‌లో ఇప్పటి వరకు నేను గొప్ప క్యాచ్‌లు అందుకోలేదు. కానీ ఈ రోజు ఆ కోరిక నెరవేరింది. నా కెరీర్‌లో ఇదే బెస్ట్ క్యాచ్. అందుకే సంతోషంగా ఉంది.

రోహిత్ పర్వాలేదన్నాడు..

రోహిత్ శర్మ రనౌట్‌పై పర్వాలేదన్నాడు. గత మ్యాచ్‌లో కూడా అతను రనౌట్ అయ్యాడు. కొత్త బంతితో గుర్నూర్ బౌలింగ్ చేసిన విధానం, డెత్ ఓవర్లలో మా బౌలింగ్ అద్భుతంగా ఉంది. హర్ష్ దూబే కూడా తన తొలి ఓవర్‌లో 16 పరుగులు ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నాడు.

వన్డేల్లో మిడిల్ ఓవర్లు చాలా కీలకం. బౌలింగ్‌లో నిరంతరం అవకాశాలను సృష్టిస్తూ ఒత్తిడిని కొనసాగించాలి. బ్యాటింగ్‌లో అయితే గ్యాప్స్ చూసి షాట్లు కొడుతూ స్ట్రైక్ రొటేట్ చేయాలి. మేం టీమ్ మీటింగ్స్‌లో కూడా సరిగ్గా ఇదే చర్చించుకుంటాం.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, June 14, 2026, 6:20 [IST]
Other articles published on Jun 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+