Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హార్దిక్ పాండ్యా ఇద్దరితో సమానం.. అచ్చం జాక్వస్ కల్లీస్‌లానే: పాక్ మాజీ కోచ్

 Mickey Arthur compares Hardik Pandya with Jacques Kallis After India beat Pakistan in Asia Cup 2022

దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. హార్దిక్ అసాధారణమైన ప్రదర్శన కనబర్చాడని మాజీ క్రికెటర్లు కొనియాడుతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థిన్ మాజీ కోచ్, సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం మిక్కీ ఆథర్ సైతం హార్దిక్ పాండ్యా ఆట తీరును మెచ్చుకున్నాడు. హార్దిక్ పాండ్యా ఇద్దరు ఆటగాళ్లతో సమానమని, అతన్ని చూస్తే సౌతాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్ జాక్వస్ కల్లీస్ గుర్తుకొస్తాడని చెప్పాడు.

ఆదివారం జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫలితంపై స్పందించిన మిక్కీ ఆథర్ ఆస్తికర వ్యాఖ్యలు చేశాడు. 'హార్ధిక్ పాండ్యా ఒక్కడూ ఇద్దరు ప్లేయర్లతో సమానం. అతన్ని తుదిజట్టులో ఆడించడం వల్లే టీమిండియా 12 మంది ప్లేయర్లతో బరిలో దిగినట్టైంది. హార్ధిక్ పాండ్యా ఆటతీరు ఎప్పుడూ నాకు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వస్ కలీస్‌ని గుర్తుకుతెస్తుంది. టాప్ 5లో బ్యాటింగ్ చేస్తూ, టాప్ 4 సీమర్లలో ఒకడిగా బౌలింగ్ చేయగల ఆల్‌రౌండర్ దొరకడం ఏ టీమ్‌కైనా అదృష్టమే...

హార్ధిక్ పాండ్యా చాలా మెచ్యూర్డ్‌గా ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో అతను జట్టుని నడిపించిన విధానం అద్భుతం. కీలక సందర్భాల్లోనూ ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా హార్ధిక్ పాండ్యా, జట్టును చక్కగా నడిపించాడు.'అని మిక్కీ ఆథర్ కొనియాడాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఇదే పాకిస్థాన్‌తో దుబాయ్ వేదికగానే జరిగిన మ్యాచ్‌లో టాపార్డర్‌తో సహా హార్దిక్ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అప్పట్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్.. జట్టుకు కూడా దూరమయ్యాడు. తన ఫిట్‌నెస్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టిన అతను.. మళ్లీ ఐపీఎల్ 2022 సీజన్‌తో సత్తా చాటాడు. ఆ తర్వాత భారత జట్టులోకి వచ్చి దుమ్మురేపాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణిస్తూ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు.

Story first published: Tuesday, August 30, 2022, 16:09 [IST]
Other articles published on Aug 30, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+