CWC 2023: టీమిండియా అంటే విద్వేషంతో రగిలిపోయే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తన రూట్ మార్చాడు. వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నందుకో.. లేక మరే కారణమో తెలియదు కానీ రోహిత్ సేనకు మద్దతుగా మాట్లాడుతున్నాడు. తాజాగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఫలితాన్ని తనదైన శైలిలో విశ్లేషించాడు.
గత శనివారం(అక్టోబర్ 14) అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపు వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై తమ ఆధిపత్యాన్ని 8-0కు పెంచుకుంది.

అయితే ఈ ఫలితంపై స్పందిస్తూ పాకిస్థాన్ టీమ్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్ చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఇది ఐసీసీ ఈవెంట్‌లా లేదని, బీసీసీఐ సొంత కార్యక్రమంలా మారిపోయిందన్నాడు. మైదానంలో పాకిస్థాన్‌ను ప్రోత్సహించేవారే లేకుండా పోయారని.. కనీసం దిల్ దిల్ పాకిస్థాన్ సాంగ్‌ను కూడా ప్లే చేయలేదని మిక్కీ ఆర్థర్ అసహనం వ్యక్తం చేశాడు.
దాంతో అతని వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. సాంగ్ పెట్టకపోతే మ్యాచ్ ఓడిపోవడం ఏంటని ఫన్నీ ట్రోల్స్ కూడా ట్రెండ్ అయ్యాయి. తాజాగా ఇవే కామెంట్స్‌ను ఉద్దేశించి మైకేల్ వాన్ తనదైన శైలిలో మిక్కీ ఆర్థర్‌ను ట్రోల్ చేశాడు. రోహిత్ శర్మ కోరిక మేరకే డీజే.. ఆ సాంగ్ పెట్టలేదని సెటైర్లు పేల్చాడు.
ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ హోస్ట్‌గా వ్యవహరించిన ఓ పోడ్‌కాస్ట్‌లో మైకేల్ వాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ పోడ్‌కాస్ట్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను విశ్లేషించిన దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ కెప్టెన్సీని కొనియాడారు. మైదానంలో అతను అమలు చేసిన వ్యూహాలు, బౌలర్ల మార్పు, ఫీల్డ్ ప్లేస్‌మెంట్ అద్భుతమని గిల్‌క్రిస్ట్ కొనియాడాడు.
అనంతరం మైకేల్ వాన్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ సూపర్ కెప్టెన్సీతో పాటు వ్యూహాత్మకంగా పాకిస్థాన్ సాంగ్స్ పెట్టవద్దని డీజేకు సూచించాడని చమత్కరించాడు. దాంతో ఈ పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న వారంత నవ్వు ఆపుకోలేకపోయారు.
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ వేసిన మంచి ఎత్తుగడ ఏంటంటే.. పాకిస్థాన్ కోచ్ చెప్పిందే. మ్యాచ్‌లో దిల్ దిల్ పాకిస్థాన్ సాంగ్ ప్లే చేయవద్దంటూ రోహిత్ డీజేను కోరాడు. ఒకవేళ సాంగ్ ప్లే చేస్తే పాకిస్థాన్ గెలుస్తుందని రోహిత్ డీజేకు చెప్పాడు. అందుకే ఆ సాంగ్ ప్లే చేయొద్దంటూ మ్యాచ్‌కు ముందే డీజేను రోహిత్ రిక్వెస్ట్ చేశాడు.
ప్రపంచకప్‌లో ఇప్పటి వరకూ ఏడుసార్లు పాకిస్థాన్ మీద గెలిచాం. ఇప్పుడు దిల్ దిల్ పాకిస్థాన్ సాంగ్ ప్లే చేస్తే వారు మనల్ని ఓడిస్తారని డీజేతో చెప్పాడు. నిజంగా ఇది చాలా తెలివైన ఆలోచన. చాలా మంది కెప్టెన్లు డీజే, మ్యూజిక్ గురించి ఏ మాత్రం ఆలోచించరు. కానీ రోహిత్ వ్యూహాత్మకంగా వ్యవహరించాడు'అని మిక్కీ ఆర్థర్‌ను మైకేల్ వాన్ ఓ ఆటాడేసుకున్నాడు.
ప్రస్తుతం ఈ కామెంట్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.