ఇంత పిరికి జట్టును నేను చూడలేదు.. పాకిస్థాన్‌పై మైఖేల్ వాన్ ఘాటు వ్యాఖ్యలు!
పాకిస్థాన్ జట్టుపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇంత పిరికిపంద జట్టును ఎప్పుడూ చూడలేదని విమర్శించాడు. పాకిస్థాన్ భవిష్యత్తు తలుచుకుంటేనే తనకు భయమవుతుందని తెలిపాడు. మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్.. లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
రెండు ఇన్నింగ్స్‌ల్లో పాకిస్థాన్ 170, 135 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ చేసిన 61 పరుగులు మినహా మరే బ్యాటర్ హాఫ్ సెంచరీ సాధించలేదు.రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సున్నాకే తొలి వికెట్ కోల్పోయి చెత్త రికార్డ్‌ను పాక్ మూటగట్టుకుంది. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం 409 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఇంత పిరికి జట్టును చూడలేదయ్యా..
పాకిస్థాన్ ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన మైఖేల్ వాన్ ఇంత పిరికి జట్టును తాను ఎప్పుడూ చూడలేదన్నాడు. 'పాకిస్థాన్ పూర్తిగా చిత్తయ్యింది. ఆ జట్టు ఇంత పిరికిగా ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు. ఆ జట్టులో వ్యూహాత్మక అంశం కొరవడింది. ఇరు జట్ల మధ్య ఉన్న నైపుణ్య స్థాయి.. పోటీ తీవ్రతను చూస్తే.. పాకిస్తాన్ చాలా వెనుకంజలో ఉన్నట్లు కనిపిస్తోంది.

పాకిస్థాన్ జట్టు ప్రదర్శన చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. గతంలో నేను చాలా పాకిస్థాన్ జట్లను చూశాను. కానీ ఒకప్పటి పాకిస్థాన్ జట్టులో ఉన్న స్ఫూర్తి, పోరాట పటిమ ఆ జట్టులో కొరవడినట్లు అనిపిస్తోంది. పాకిస్థాన్ జట్టు గురించి నాకు భయంగా ఉంది. కనీస పోటీ ఇవ్వలేకపోయింది.'అని బీబీసీ టెస్ట్ మ్యాచ్ షోలో మైఖేల్ వాన్ చెప్పుకొచ్చాడు.
ఇన్నింగ్స్ తేడాతో ఓటమి..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే కుప్పకూలింది. అబ్దుల్లా షఫీక్(61) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇమామ్ ఉల్ హక్(42) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్(5/51), జోష్ టంగ్(5/46) ఐదేసి వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించారు. అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 409 పరుగుల భారీ స్కోర్ చేసింది. జోర్డాన్ కాక్స్(73), కెప్టెన్ జోరూట్(66), హ్యారీ బ్రూక్(91), డాన్ లారెన్స్ సత్తా చాటారు.
పాక్ బౌలర్లలో అలి ఉస్మాన్(5/95) ఐదు వికెట్లు తీయగా.. ఖుర్రమ్ షెహ్‌జాద్(3/133) మూడు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ అబ్బాస్, మహమ్మద్ అలీ తలో వికెట్ తీసారు. 238 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. షాన్ మసూద్(29), మహమ్మద్ రిజ్వాన్(41) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, జోఫ్రా ఆర్చర్, ఓలీ రాబిన్సన్ మూడేసి వికెట్లు తీయగా.. గస్ అట్కిన్సన్ ఒక వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
