India vs England: అదేమైనా బ్యాటింగ్ ఆర్డరేనా.. టీమిండియా సెలెక్టర్లపై మండిపడ్డ మైకేల్ వాన్!!

లండన్: ఇంగ్లండ్ పర్యటన మొదలైనప్పటి నుంచి ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సెటైర్లు వేస్తున్న విషయం తెలిసిందే. చెన్నై, మొతేరా పిచ్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసిన వాన్.. తాజాగా టీ20 టాస్ విషయంలో స్పందించాడు. ఇప్పుడు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐదు టీ20ల సిరీస్‌కు సంబంధించి టీమిండియా మూడో టీ20లో ఓడిపోవడానికి బ్యాటింగ్ ఆర్డరే ప్రధాన కారణమని తెలిపాడు. బ్యాటింగ్ ఆర్డర్ సరిగా లేదంటూ టీమిండియా సెలెక్టర్లపై మండిపడ్డాడు. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంపై వాన్ అభ్యన్తరం వ్యక్తం చేశాడు.

బ్యాటింగ్ ఆర్డర్ సరిగా లేకపోవడయే
తాజాగా క్రిక్‌బజ్‌తో మైకేల్ వాన్ మాట్లాడుతూ... 'టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా.. టీ20 సిరీస్‌లో మాత్రం తేలిపోతోంది. ప్రస్తుతం టీ20ల్లో ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుతో ఆడుతున్నామనే విషయం గుర్తుంచుకోవాలి. మొదటి మ్యాచ్‌లో ఓటమి అనంతరం రెండో టీ20లో టీమిండియా అద్భుతంగా ఫుంజుకున్నట్లుగా అనిపించినా.. తర్వాతి మ్యాచ్‌కు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ సరిగా లేకపోవడయే భారత్ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు' అని అన్నాడు.

ఆ లోటు స్పష్టంగా కనిపించింది
'రెండో టీ20లో ఓపెనింగ్ స్థానంలో ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడాడు. మూడో టీ20కి రోహిత్ శర్మ తుది జట్టులోకి తిరిగి రావడంతో ఇషాన్ బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడో స్థానంలో వచ్చాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. రోహిత్ శర్మను ఓపెనింగ్‌లో ఆడించినా.. అతనికి జతగా ఇషాన్ పంపిస్తే బాగుండు. అప్పడు లోకేష్ రాహుల్ మిడిల్ ఆర్డర్‌లో వచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో సిరీస్‌కు దూరమవడం.. పెళ్లి కారణంతో జస్ప్రీత్ బుమ్రా దూరం కావడంతో టీమిండియా బౌలింగ్‌లో లోటు స్పష్టంగా కనిపించింది' అని వాన్ పేర్కొన్నాడు.

టాస్ గెలిస్తే
మొతేరా వేదికగా ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న టీ20 సిరీసులో టాస్ కీలకం అవుతుండటంపై ఇంగ్లీష్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సెటైర్లు వేశాడు. చూస్తుంటే భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో మెరుగైన టాసర్.. కప్‌ను కైవసం చేసుకుంటారేమోనని ట్వీట్ చేశాడు. ఐదు టీ20 సిరీస్‌లో ఇప్పటి వరకు మూడు మ్యాచులు జరిగాయి. అన్నింట్లో కూడా టాస్ గెలిచిన జట్టే.. మ్యాచ్ కూడా గెలిచింది. అయితే తమ ఓటములకు టాస్‌ను నిందించబోమని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.

గెలిస్తేనే సిరీస్‌లో నిలిచేది
మొతేరాలో ఈరోజు జరగనున్న నాలుగో టీ20 టీమిండియాకు కీలకంగా మారింది. 5 టీ20ల సీరిస్‌లో ఇప్పటికే ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్‌లో నిలుస్తుంది. ఒకవేళ ఓడితే మాత్రం సిరీస్ చేజారుతుంది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తేనే.. పటిష్టమైన ఇంగ్లండ్‌పై టీమిండియాకు విజయం సాధ్యమవుతుంది. జట్టుగా సత్తాచాటి మోర్గాన్ సేనను దెబ్బకు దెబ్బ కొట్టి సిరీస్ సమం చేయాలని టీమిండియా చూస్తోంది.
4, 4, 4, 6.. 4 బంతుల్లోనే లక్ష్య ఛేదన! వన్డేల్లో అరుదైన ఘటన!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications