న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇదేందయ్యా ఇది.. మైకేల్ వానూ... ఈ షాట్ ఏడా చూడలే! (వీడియో)

 Michael Vaughan Shares Video Of Unique Cricket Shot Goes Viral

న్యూఢిల్లీ: క్రికెట్‌కు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరుచూ వార్తల్లో నిలిచే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్.. తాజాగా ఓ వీడియోతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ తరం క్రికెట్‌లో ఆటగాళ్లు వినూత్న షాట్లతో పరుగులు రాబడుతున్నారు. ఒకప్పటి సాధారణ ఫార్మూలాలను పక్కనపెట్టి కొత్తగా మైదానం నలువైపులా ఆడుతూ బౌలర్లు చితక బాదుతున్నారు. బౌలర్లు ఎంత అద్భుతమైన బంతి వేసినా తమదైన ఇన్నోవేటివ్ షాట్‌తో పరుగులు రాబడుతున్నారు. ఈ క్రమంలో క్రికెట్‌లోకి హెలికాప్టర్, దిల్ స్కూప్, అప్పర్ కట్, స్వీపర్, స్వీప్, రివర్స్ స్వీప్ అంటూ అనేక కొత్త షాట్లు వచ్చాయి.

తాజాగా ఈ వినూత్న షాట్లను ఉద్దేశించి మైకేల్ వాన్ ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. దానికి ప్రాపర్ షాట్ అని క్యాప్షన్‌గా పేర్కొంటూ కితాబిచ్చాడు. ఈ వీడియోలో స్థానిక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో ఓ బ్యాటర్ వినూత్నంగా సిక్సర్ బాదాడు. బౌలర్ వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బంతిని ఒక కాలెత్తి బ్యాట్‌తో కీపర్ వైపు ఆడుతూ సిక్సర్ బాదాడు. చాలా విచిత్రంగా ఉన్న ఈ షాట్‌కు ఫిదా అయిన మైకేల్ వాన్.. ప్రాపర్ షాట్ అంటూ అభిమానుల దృష్టికి తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వీడియోను చూసిన అభిమానులు తమదైన శైలిలో సెటైర్లు పేల్చుతున్నారు. ఇది ఐపీఎల్‌లో జరిగిందా? అని ఓ పాకిస్థాన్ అభిమాని సెటైర్ వేయగా.. అవును దేశీ ఐపీఎల్.. మీ పీఎస్‌ఎల్ కంటే ఎన్నో రెట్లు బెటర్ అంటూ భారత అభిమాని బదులిచ్చాడు. టెన్నిస్ బాల్ క్రికెట్‌లో ఇలాంటి షాట్స్ సాధారణమని, కానీ గ్రేస్ బాల్‌తో ఆడే దమ్ము బ్యాటర్లకు ఉందా? అని మరో ఫ్యాన్ సందేహం వ్యక్తం చేశాడు.

కొంచెం ఎటమటమైతే బ్యాటర్ బాక్స్ బద్దలవుతుందని, సంసారానికే పనికిరాకుండా పోతాడని ఇంకొందరు హెచ్చరించారు. *ఇదేందయ్యా ఇది.. మైకేల్ వానూ... ఈ షాట్ ఏడా చూడలే'అంటూ ఫన్నీగా స్పందించాడు. అయితే ఇది ఫేక్ వీడియో అని,రీల్ వీడియో కోసం చేసిందని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా మైకేల్ వాన్ ఈ వీడియోను పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఐపీఎల్‌లో ఈ షాట్ ఆడే దమ్ము కృనాల్ పాండ్యా, హెట్‌మైర్‌లకు మాత్రమే ఉందని ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ప్లేయర్ యాన్నిక్ బొలాసి కామెంట్ చేశాడు.

Story first published: Thursday, May 5, 2022, 16:46 [IST]
Other articles published on May 5, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X