For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంత దరిద్రమైన ఫీల్డింగ్ చేస్తే సెంచరేం కర్మ.. డబుల్, ట్రిపుల్స్ బాదొచ్చు!(వీడియో)

Michael Vaughan Shares Hilarious Cricket Video On Twitter

లండన్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ గురువారం తన ట్విటర్ వేదికగా ఓ వీడియో పంచుకున్నాడు. పరమ చెత్త ఫీల్డింగ్ అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఆ వీడియోను చూస్తే సరిపోతుంది. చిన్న పిల్లల కన్నా మరీ అధ్వాన్నంగా ఉంది. ఎంతలా అంటే.. ఒకే బంతికి మూడు సార్లు ఔటయ్యే అవకాశం చేజారడంతో పాటు ప్రత్యర్థికి అప్పనంగా నాలుగు పరుగులు ఇచ్చేశారు. ఇంత అద్భుతమైన దృశ్యం ఐరోపా క్రికెట్ లీగ్‌లో చోటు చేసుకోగా వాన్.. అభిమానులతో పంచుకుంటూ సెటైర్లు పేల్చాడు.

ఇంతకేం జరిగిందంటే..?

ఐరోపా క్రికెట్‌ సిరీస్‌లో వర్మడో సీసీ, స్టాక్‌హోం సూపర్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. స్టాక్‌హోం ఆటగాడు కీపర్‌ వెనక్కి బంతిని ఆడగా కీపర్‌ పరుగెత్తుకు వెళ్లాడు కానీ చేతులో పడిని బంతిని నేలపాలు చేశాడు. ఇంతలోనే బ్యాట్స్‌మెన్‌ పరుగు ఆరంభించారు. కీపర్‌ బౌలర్‌ వైపు బంతి విసరగా అతడు పట్టుకోలేదు. దాంతో బ్యాటర్లు మరో పరుగు అందుకున్నారు. ఇంతలోనే లాంగాన్‌లోని ఫీల్డర్‌ బంతిని విసరగా మళ్లీ ఎవ్వరూ పట్టుకోలేదు. దాంతో బ్యాటర్లు మళ్లీ పరుగు తీయడం మొదలుపెట్టారు. ఇలా మొత్తంగా వారు నాలుగు పరుగులు చేయడం గమనార్హం. ఆయాసం వచ్చి ఆగిపోయారు కానీ ఆ ఫీల్డింగ్‌కు మరో రెండు పరుగులు తీసినా ఆశ్చర్యమేమీ లేదు!

పిల్లి కూడా సెంచరీ చేస్తోంది..

పిల్లి కూడా సెంచరీ చేస్తోంది..

ప్రస్తుతం వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌ సహా చాలామంది దీనికి స్పందించారు. 'ఇప్పుడు ఇదే అసలైన క్రికెట్‌!!!' అని వాన్‌ కామెంట్‌ చేశాడు. 'బ్యాట్స్‌మన్‌ ప్యాడ్లు జారిపోతున్నా నాలుగు పరుగులు తీయడం గొప్పే' అని మరొకరు అన్నారు. 'ఇలాంటి ఫీల్డింగ్‌ పరిస్థితులు ఉంటే నా పిల్లి సెంచరీ పరుగులు తీయగలదు' అని ఇంకొకరు చమత్కరించారు. ఇలాంటి దరిద్రమైన ఫీల్డింగ్ ఉంటే ఆటగాళ్లు సెంచరీలు కదా డబుల్, ట్రిపుల్ బాదుతారని కామెంట్ చేశారు.

 పాక్ ట్రైనింగ్..

పాక్ ట్రైనింగ్..

కోడ్‌లో బగ్ ఉంటే కంప్యూటర్ గేమ్‌ ఎలా ఉంటుందో ఇదీ అలాగే ఉందని ఓ వ్యక్తి స్పందించగా.. ఇదే పరిస్థితుల్లో పరిగెత్తాల్సి వస్తే.. చిన్నపిల్లాడు కూడా సెంచరీ కొట్టేస్తాడని మరో నెటిజన్ సెటైర్లు వేశాడు. వీళ్లు కచ్చితంగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ల దగ్గర శిక్షణ పొంది ఉంటారు. ఈ విభాగంలో వాళ్లు నిష్ణాతులు అంటూ మరో నెటిజన్ పాకిస్థాన్ ఆటగాళ్లను ట్రోల్ చేశాడు. క్రికెట్లో అప్పుడప్పుడు సరదా సంఘటనలూ చోటుచేసుకుంటుంటాయి. వాటిని చూసి అభిమానులను కడుపుబ్బా నవ్వుకుంటారు. ఐపీఎల్‌ సహా అనేక క్రికెట్‌ లీగుల్లో హాస్య సన్నివేశాలను మనం చూసుంటాం. ఇది అదే తరహాలోనిదే వదిలేయండని మరో అభిమాని సూచించాడు.

Story first published: Friday, March 12, 2021, 13:26 [IST]
Other articles published on Mar 12, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+