Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: ఒకప్పటి సెహ్వాగ్-సచిన్ జోడీని గుర్తుకుతెచ్చారు.. ఓపెనర్లుగా వారిద్దరే కరెక్ట్: మైకేల్ వాన్

Michael Vaughan says Virat Kohli-Rohit Sharmas opening pair reminds Sehwag and Sachin

లండన్: సుదీర్ఘకాలం తర్వాత టీ20ల్లో భారత జట్టుకి అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ దొరికిందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ప్రముఖ వ్యాఖ్యాత మైకేల్ వాన్ పేర్కొన్నాడు. రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీలు ఒకప్పటి వీరేందర్ సెహ్వాగ్-సచిన్ టెండూల్కర్ జోడీని గుర్తుకుతెచ్చారని వాన్ అభిప్రాయపడ్డాడు. టీ20ల్లో భారత జట్టుకి అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ రోహిత్-కోహ్లీలే అని చెప్పాడు. ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్ వేదికగా గత శనివారం రాత్రి జరిగిన ఐదో టీ20లో ఓపెనర్లుగా ఆడిన కోహ్లీ (80 నాటౌట్: 52 బంతుల్లో 7x4, 2x6), రోహిత్ శర్మ ( 64: 34 బంతుల్లో 4x4, 5x6) హాఫ్ సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.

 రాహుల్ విఫలమవడంతో:

రాహుల్ విఫలమవడంతో:

ఓపెనర్ కేఎల్ రాహుల్ మొదటి నాలుగు టీ20ల్లోనూ విఫలమయిన విషయం తెలిసిందే. 1, 0, 0, 14 పరుగులతో పూర్తిగా నిరాశపరిచాడు. దీంతో ఐదో టీ20లో రాహుల్‌పై వేటు వేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అతని స్థానంలో పేసర్ టీ నటరాజన్‌ని తుది జట్టులోకి తీసుకున్నాడు. దాంతో రోహిత్ శర్మకి జోడీగా కోహ్లీ ఓపెనర్‌గా రావాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడిన కోహ్లీ, రోహిత్.. పోటీపడి మరీ పరుగులు చేశారు. ఈ క్రమంలోనే తొలి వికెట్‌కి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ ఔటైనా.. కోహ్లీ చివరి వరకూ క్రీజులో నిలిచి టీమిండియాకు భారీ స్కోర్ అందించాడు.

 సచిన్-సెహ్వాగ్ ఓపెనింగ్ జోడిని గుర్తుకుతెచ్చారు:

సచిన్-సెహ్వాగ్ ఓపెనింగ్ జోడిని గుర్తుకుతెచ్చారు:

తాజాగా మైకేల్ వాన్ టెలిగ్రాఫ్ కోసం రాసిన ఓ కథనంలో భారత టీ20 ఓపెనింగ్ జోడిపై స్పందించాడు. 'సరైన బ్యాటింగ్ ఆర్డర్‌‌ కోసం కొన్నిసార్లు అదృష్టం కూడా ఉండాలి. టీమిండియాకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ‌ జోడీ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. సిరీస్ ఆరంభంలో ఈ ఇద్దరినీ ఓపెనర్లుగా పంపాలని నాకు తెలిసి ఎవరూ అనుకుని ఉండరు. కోహ్లీ-రోహిత్ జోడీ నాకు ఒకప్పటి సచిన్-సెహ్వాగ్ ఓపెనింగ్ జోడిని గుర్తుకుతెచ్చింది. టీ20ల్లో కేవలం 120 బంతుల్ని బ్యాట్స్‌మెన్‌లు పంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి టీమిండియా అత్యధిక బంతుల్ని కోహ్లీ, రోహిత్ ఆడాలని ఆశించింది. మిగిలిన వాళ్లు సపోర్ట్‌గా ఉంటే సరిపోతుంది' అని వాన్ పేర్కొన్నాడు.

 కోహ్లీని ఓపెనర్‌గా కొనసాగించాలి:

కోహ్లీని ఓపెనర్‌గా కొనసాగించాలి:

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా కొనసాగించాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఇప్పటికే సూచించాడు. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా మిడిల్ ఆర్డర్‌లో ఆడేవాడని, ఓపెనింగ్‌కు వచ్చాక భారత జట్టు రూపురేఖలే మారిపోయాయని ఈ లిటిల్ మాస్టర్ గుర్తు చేశాడు. 'పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ అధిక ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేయాలి. విరాట్‌ కోహ్లీ కూడా ఇలాగే ఓపెనర్‌గా కొనసాగాలి' అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

 94, 49, 81 భాగస్వామ్యాలు:

94, 49, 81 భాగస్వామ్యాలు:

ఇంగ్లండ్‌తో శనివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరిదైన ఐదో టీ20లో భారత్ 36 పరుగులతో తేడాతో గెలిచి 5 టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన విరాట్ కోహ్లీ (80 నాటౌట్‌) దుమ్మురేపాడు. రోహిత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలతో వరుసగా 94, 49, 81 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పి.. భారత్ భారీ స్కోర్ చేయడం కీలక పాత్ర పోషించాడు. దాంతో ఓపెనింగ్ జోడీపై, ముఖ్యంగా కోహ్లీపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంది.

India vs England: ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. ఆ ఇద్దరు భారత స్టార్ ఆటగాళ్లకు షాక్! తుది జట్టు ఇదే!

Story first published: Monday, March 22, 2021, 20:13 [IST]
Other articles published on Mar 22, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+