For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ విజయం నా ముఖంపై గుడ్లతో కొట్టినట్లుంది: మైఖేల్ వాన్

Michael Vaughan says Team India left me with egg on my face after historic win against Australia

లండన్: ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ ఘోర పరాజయం తర్వాత భారత్ 4-0తో క్లీన్ స్వీప్ అవుతుందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ జోస్యం చెప్పాడు. ఓ వైపు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ఆసీస్ జట్టులోకి రాగా.. మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ మీద సిరీస్ నుంచి తప్పుకోవడం.. అడిలైడ్‌లో 36 పరుగులకే ఆలౌటై చిత్తుగా ఓడటంతో వాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఆసీస్‌పై గెలవడం దేవుడెరుగు గట్టి పోటినిస్తే చాలని చాలా అవహేళనగా మాట్లాడాడు. మైఖేల్ వానే కాదు ఆసీస్ మాజీ క్రికెటర్లు రికీ పాంటింగ్, మైకేల్ క్లార్క్ కూడా ఇలానే మాట్లాడారు. కానీ కోహ్లీ గైర్హాజరీలో సారథ్య బాధ్యతలు అందుకున్న రహనే జట్టును అద్భుతంగా నడిపించాడు.

ముఖంపై గుడ్లతో కొట్టినట్లు..

ముఖంపై గుడ్లతో కొట్టినట్లు..

ముందుగా మెల్‌బోర్న్ టెస్ట్‌లో బాధ్యతాయుతమైన సెంచరీతో విజయాన్నందించి సిరీస్‌లో లెక్కను సరిచేశాడు. ఆ తర్వాత అశ్విన్- విహారీ అసాధారణ పోరాటంతో సిడ్నీ టెస్ట్‌ను డ్రా చేసుకున్న భారత్.. యువ ఆటగాళ్ల సాయంతో ఆసీస్ గబ్బా కోటను బద్దలు కొట్టి 2-1తో సిరీస్‌నే కైవసం చేసుకుంది. దీంతో మైఖెల్ వాన్, ఆసీస్ మాజీ క్రికెటర్లపై భారత అభిమానులు తీవ్ర ట్రోలింగ్‌కు దిగారు. తాజాగా దీనిపై స్పందించిన మైఖేల్ వాన్.. భారత్ చారిత్రాత్మక విజయం తన ముఖంపై గుడ్లతో కొట్టినట్లుగా ఉందని పేర్కొన్నాడు.

భారత అభిమానులు కూడా..

భారత అభిమానులు కూడా..

ది టెలిగ్రాఫ్‌కు రాసిన కథనంలో భారత జట్టుపై తాను చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించాడు. అయితే భారత్ విజయాన్ని ఆ దేశ అభిమానులు కూడా ఊహించలేదని, తనపై వచ్చే విమర్శలను పట్టించుకోనన్నాడు. 'అడిలైడ్ విజయం తర్వాత ఆస్ట్రేలియా 4-0తో భారత్‌ను చిత్తు చేస్తుందనుకున్నా. కానీ ఆటగాళ్ల ఎంపిక, గాయాలు ఇలా పలు సమస్యలు వెంటాడినప్పటికీ టీమిండియా పుంజుకుని బాగా ఆడింది. అయితే దీన్ని భారత్​ అభిమానులు కూడా ఊహించి ఉండరు. కానీ భారత్ విజయం నా ముఖంపై గుడ్లతో కొట్టినట్లుగా ఉంది.

యువ ఆటగాళ్లు రాణించడంతోనే..

యువ ఆటగాళ్లు రాణించడంతోనే..

అయితే ఈ విషయంలో భారత అభిమానుల విమర్శలను నేను పట్టించుకోను. అరంగేట్ర యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్​, వాషింగ్టన్ సుందర్​, శార్దూల్ ఠాకూర్​ అద్భుతమైన ప్రదర్శన చేయడం వల్లే నా అంచనా తప్పింది. దానికి నేనేం బాధపడటం లేదు. అయితే ఈ విజయం ఆస్ట్రేలియా జట్టుపై అనేక ప్రశ్నలను రేకెత్తిస్తుంది. యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు ఆశలను కల్పిస్తుంది. జోరూట్ నాయకత్వంలోనే ఇంగ్లండ్ యాషెస్ సిరీస్ గెలవాల్సిన అవసరం ఉంది.

ఆసీస్ టీమ్‌లో లుకలుకలు..

ఆసీస్ టీమ్‌లో లుకలుకలు..

ఆస్ట్రేలియా జట్టుకు కూడా లోపాలున్నాయని భారత్ రుజువు చేసింది. ఆస్ట్రేలియాలో స్మిత్​, లబుషేన్​ లాంటి స్టార్​ బ్యాట్స్​మన్​, నాథన్​ లైయన్​ వంటి బౌలర్లతో బలమైన పేస్ దళం ఉన్నప్పటికీ కీలక సమయాల్లో సరిగ్గా రాణించలేకపోయింది. ఈ ఓటమితో టిప్‌ పైన్ కెప్టెన్సీపై సందేహాలు మొదలయ్యాయి. సారథిగా జట్టుకు వియాన్నందించడంలో పైన్ విఫలమయ్యాడు.'అని మైఖేల్ వాన్ రాసుకొచ్చాడు.

Story first published: Thursday, January 21, 2021, 16:02 [IST]
Other articles published on Jan 21, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+