IPL 2021 వేలంలో గ్లేన్ మ్యాక్స్‌వెల్ కోసం పోటీ తప్పదు!

లండన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ కోసం నిర్వహించే వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. 13వ సీజన్‌లో అతను దారుణంగా విఫలమైనా.. 14వ సీజన్‌లో మాత్రం అతని కోసం ఫ్రాంచైజీలు ఎగబడతాయన్నాడు. భారత్‌తో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో మ్యాక్సీ పరుగుల విధ్వంసం సృష్టించాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో పాత మ్యాక్సీని గుర్తు చేశాడు. ఈ క్రమంలో మ్యాక్స్‌వెల్ ఆటను కొనియాడుతూ.. తదుపరి ఐపీఎల్ సీజన్ వేలంలో అతను కీలకం అవుతాడని వాన్ చెప్పుకొచ్చాడు.

మ్యాక్సీ కోసం పోటీ తప్పదు..
‘పరిమి త ఓవర్ల క్రికెట్‌లో మ్యాక్స్‌వెల్ మంచి క్రికెటర్. ఏ జట్టైనా మ్యాక్సీలాంటి ఆటగాడ్ని వద్దనుకోదు. నేను కచ్చితంగా చెబుతున్నా.. ఈసారి ఐపీఎల్ వేలంలో మ్యాక్స్‌వెల్ కోసం చాలా జట్లు పోటీ పడతాయి. ఆస్ట్రేలియా జట్టు తరఫున మ్యాక్సీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతను ఏ స్థానంలో ఆడగలడో దాన్ని ఆసీస్ గుర్తించింది. మ్యాక్స్‌వెల్ మంచి ఫీల్డర్ కూడా. కొన్ని కీలకమైన పరుగుల్ని కూడా మ్యాక్సీ సేవ్ చేస్తాడు. దాంతో వచ్చే సీజన్‌లో అతనిపై ఎక్కువ ఫోకస్ ఉంటుంది'అని వాన్ పేర్కొన్నాడు.

ఒక్క సిక్స్ కొట్టలేదు..
ఈ ఐపీఎల్ సీజన్‌లో కింగ్స్ పంజాబ్ తరఫున ఆడిన మ్యాక్సీ దారుణంగా విఫలమయ్యాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 108 పరుగులే చేశాడు. ఒక్క సిక్స్ కూడా లేకుండా ఐపీఎల్‌ను ముగించాడు. దాంతో మ్యాక్సీని వదిలించుకునేందుకు కింగ్స్ పంజాబ్ సిద్ధమైంది. భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా మ్యాక్సీ ఎవడూ తీసుకోడని చెప్పడు. కానీ టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మ్యాక్స్‌వెల్ చెలరేగాడు. వన్డే సిరీస్‌లో 167 పరుగులు చేసి ఆసీస్ సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 83కు పైగా సగటు, 194పైగా స్టైక్‌రేట్‌తో దుమ్ములేపాడు. ఇందులో 12 ఫోర్లు, 11 సిక్స్‌లు ఉన్నాయి. ఫలితంగా వన్డే సిరీస్‌లో అత్యధిక ‘బౌండరీలు' కొట్టిన ఆటగాడిగా నిలిచాడు.

స్విచ్ హిట్ సిక్స్.. సిరీస్‌కే హైలైట్..
ఇక బుధవారం జరిగిన మూడో వన్డేలో మ్యాక్సీ కొట్టిన స్విచ్ హిట్ సిక్స్ వన్డే సిరీస్‌కే హైలైట్‌గా నిలిచింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఆఫ్‌సైడ్ దూరంగా వేసిన బంతిని ఆడేందుకు మాక్స్‌వెల్ తన స్టాన్స్‌ను మార్చుకున్నాడు. రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసే మాక్సీ లెఫ్ట్ హ్యాండ్ వైపు తిరిగి 100 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. ఈ షాట్ చూసిన ప్రతీ ఒక్కరు అవాక్కయ్యారు.

కొత్త జట్లు..
కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ.. అందునా విదేశంలో నిర్వహించిన ఐపీఎల్ 2020 సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఫుల్ జోష్‌లో ఉంది. 14వ సీజన్‌ను భారత్‌లో నిర్వహించేందుకు కృతనిశ్చయంతో ఉన్న బోర్డు.. రెండు కొత్త జట్లకు లీగ్‌లో స్థానం కల్పించాలని భావిస్తోంది. 13వ సీజన్‌కు ఫ్యాన్స్ నుంచి మునుపెన్నడూలేని రీతిలో భారీ స్పందన లభించడంతో టోర్నీకి మరింత ప్రాచుర్యం కల్పించాలని బీసీసీఐ యోచిస్తోంది. ఈ ప్రతిపాదన సాధ్యాసాధ్యాలపై డిసెంబర్ 24న జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications