For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Michael Vaughan: ఆ పనికిమాలిన చర్యతోనే ఇంగ్లండ్ ఓటమిపాలైంది!

Michael Vaughan says Joe Root was undeniably let down by some of his senior players

న్యూఢిల్లీ: లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు ఇంగ్లండ్ పేసర్లు వరుసగా బౌన్సర్లు సంధించడాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తప్పుబట్టాడు. ఈ విషయంలో దారి తప్పిన కెప్టెన్ జోరూట్‌ను కోచ్ సిల్వర్ వుడ్ సరిచేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఈ ఒక్క తప్పిదంతోనే ఇంగ్లండ్ మూల్యం చెల్లించుకుందన్నాడు. మైదానంలో కెప్టెన్‌ జోరూట్‌కు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియనప్పుడు కోచ్‌ అడ్డుకోవాల్సిందని అన్నాడు. ఫేస్‌బుక్ వేదికగా ఓ పోస్ట్ చేసిన వాన్.. బుమ్రా విషయంలో ఇంగ్లండ్‌ ప్రవర్తించిన తీరుపై విమర్శలు గుప్పించాడు. చివరిరోజు భోజన విరామసమయానికి ముందు 20 నిమిషాల ఆటనే ఇంగ్లండ్‌ ఓటమిని శాసించిందన్నాడు.

కోచ్ ఏం చేసిండు?

కోచ్ ఏం చేసిండు?

'ఐదో రోజు ఆటలో లంచ్ బ్రేక్‌కు ముందు 20 నిమిషాల ఆటనే ఇంగ్లండ్‌ను మ్యాచ్‌లో వెనుకపడేలా చేసింది. కొన్నేళ్లుగా ఇంగ్లండ్‌ టీమ్‌ ఇలా చేయడం నేనెప్పుడూ చూడలేదు. ఇదో పనికిమాలిన చర్య. బుమ్రాకు బౌన్సర్లు వేసి ఇంగ్లండ్‌ ఎలా మూల్యం చెల్లించుకుందనే విషయంపై చాలా మంది విమర్శలు చేశారు. కెప్టెన్‌ కూడా తన బౌలర్లను అడ్డుకోలేకపోయాడు. అయితే, ఇక్కడ కోచ్‌ సిల్వర్‌వుడ్‌ జోక్యం చేసుకోకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. డ్రింక్స్‌ అందించేటప్పుడు కోచ్‌ ఎవరినైనా మైదానంలోకి పంపి బౌన్సర్లు వేయకుండా అడ్డుకొని ఉండాల్సింది. నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఏదైనా నిర్ణయాలు తీసుకోలేకపోతే అప్పుడు కోచ్‌గా ఉన్న డంకెన్‌ ఫ్లెచర్‌ నాకు ఇలాగే సందేశాలు పంపేవాడు' అని వాన్‌ తన పోస్టులో రాసుకొచ్చాడు.

ఇకనైనా తప్పులు చేయవద్దు..

ఇకనైనా తప్పులు చేయవద్దు..

రెండో టెస్టులో బుమ్రా, షమీ బ్యాటింగే కీలక సమయమని, అదే సమయంలో ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో వెనుకబడిందని అన్నాడు. దాంతో మ్యాచ్‌ గెలిచే అవకాశాన్ని ఇంగ్లండ్‌ చేజేతులా నాశనం చేసుకుందని చెప్పాడు. ఈ ఓటమికి సిల్వర్‌వుడ్‌ కూడా బాధ్యత వహించాలన్నాడు. ఇక మిగిలిన సిరీస్‌లోనైనా ఇంగ్లండ్‌ కోచ్‌ తన స్థాయికి తగ్గ మార్పును జట్టులో తీసుకురావాలని కోరాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ సరైన ధారిలో ముందుకు సాగుతున్నాడని, ఎలాంటి తప్పులు చేయడం లేదని వాన్‌ పేర్కొన్నాడు.

 చిరస్మరణీయ విజయం..

చిరస్మరణీయ విజయం..

లార్డ్స్ టెస్ట్‌లో 151 పరుగులతో ఆతిథ్య జట్టును చిత్తు చేసిన కోహ్లీసేన చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఫలితంగా ఐదు టెస్టుల సిరీసులో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. వర్షం కారణంగా మొదటి టెస్టును డ్రా చేసుకున్న కోహ్లీ సేన రెండో టెస్టులో అద్వితీయమైన విజయం అందుకుంది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌ కలిసి రాణించారు. ఆఖరి రోజు భారత పేసర్లు ఆంగ్లేయులను కేవలం 60 ఓవర్లలోపే ఆలౌట్‌ చేసి విజయం అందించడం ప్రత్యేకం. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ లీడ్స్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభం కానుంది.

అశ్విన్ ఆగయా..

అశ్విన్ ఆగయా..

ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే భారత తుది జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ జట్టులోకి రానున్నాడు. లీడ్స్ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ మార్పు జరగనుంది. అంతేకాకుండా మరో స్పిన్నర్ జడేజా బౌలింగ్ తేలిపోవడంతో అశ్విన్ తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. స్పిన్నర్ల విషయం మినహా.. లీడ్స్‌ టెస్ట్ మ్యాచుకు భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ మంచి ఫామ్ మీదున్నారు. విమర్శలపాలైన చతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలు కూడా గాడిలో పడ్డారు. ఇక విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు. వీరు కూడా పరుగులు చేస్తే.. ఇంగ్లండ్ జట్టుకు తిప్పలుతప్పకపోవచ్చు. పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ సూపర్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

Story first published: Sunday, August 22, 2021, 19:20 [IST]
Other articles published on Aug 22, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+