Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బజ్‌బాల్ ఒక్కటే కాదు.. ఇంత తెలివి కూడా ఉండాలి! మైఖేల్ వాన్ ఫైర్!

లండన్: టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే బజ్‌‌బాల్ ఒక్కటే సరిపోదని, కాసింత స్మార్ట్‌నెస్ కూడా కావాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అన్నాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. సునాయసంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌ను ఇంగ్లండ్ బజ్‌బాల్ బ్యాటింగ్‌తో ఓటమి కొని తెచ్చుకుంది.

తొలి ఇన్నింగ్స్‌ను తొలి రోజే డిక్లేర్ చేయడం.. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ల పడుతున్నా బజ్‌బాల్ బ్యాటింగ్‌నే కొనసాగించడం విమర్శలకు దారి తీసింది.కనీసం లార్డ్స్ వేదికగా జరిగే రెండో టెస్ట్‌లోనైనా కాస్త తెలివితో ఆడాలని ఇంగ్లండ్‌కు మైఖేల్ వాన్ సూచించాడు.'లార్డ్స్ వేదికగా జరిగే రెండో టెస్ట్‌లో ఇరు జట్లలోనూ చిన్న చిన్న మార్పులు ఉంటాయని అనుకుంటున్నా.

Michael Vaughan says I love Bazball but England failed to nail Australia down

తొలి టెస్టులో దక్కిన విజయం ఆస్ట్రేలియాకు కచ్చితంగా ఉత్సాహాన్ని ఇస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్ ఆటతీరుపై ఆ జట్టుకు పూర్తి స్పష్టత వచ్చేసి ఉంటుంది. బజ్‌బాల్.. నాకు ఎంతో ఇష్టం. దూకుడు ఆడటానికి నేనేం వ్యతిరేకం కాదు. అయితే అన్నివేళలా అలా ఆడుతానంటే కుదురదు. టెస్ట్‌ల్లో శక్తిని నింపడానికి దూకుడు ఒక్కటే మార్గం కాదు.

కొన్నిసార్లు క్లాస్ కూడా చూపించాలి. బజ్‌బాల్ అయినా మరేబాల్ అయినా జట్టు గెలవడం ముఖ్యం. అందుకు కాస్త స్మార్ట్‌నెస్ కూడా కావాలి. పరిస్థితులకు తగ్గట్లు ఓపికగా ఆడటం కూడా ముఖ్యమే. ఆస్ట్రేలియా వెనకడుగు వేసినప్పుడు, దాన్ని మరింత వెనక్కినెట్టే ఎత్తులు కావాలి. అయితే ఇంగ్లండ్ అది చేయలేకపోయింది.

రెండు సార్లు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడలేకపోయారు. ఈ సారి బజ్ బాల్ కాన్సెప్ట్‌‌ను నమ్ముకోవడంతో ఇంగ్లండ్‌పై భారీ నమ్మకాలు ఉన్నాయి. ఈసారి కూడా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించకపోతే.. బజ్ బాల్ గేమ్ ఆడి కూడా వృథానే'అని మైఖేల్ వాన్ చెప్పుకొచ్చాడు.

ఎడ్జ్‌బాస్టన్ మైదానం వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వీరోచిత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.

Story first published: Thursday, June 22, 2023, 18:26 [IST]
Other articles published on Jun 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+