For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022: మ్యాచ్‌ల రద్దు వెనుక క్రికెట్ ఆస్ట్రేలియా కుట్ర..!

Michael Vaughan reveals the reason behind Aus vs Eng calling Off In T20 World Cup

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022లో వర్షం హవా కొనసాగుతోంది. శుక్రవారం ఒక్క రోజే రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దయ్యాయి. ఈ టోర్నీలో ఇప్పటి వరకు మొత్తం నాలుగు మ్యాచ్‌లు వర్షానికి బలయ్యాయి. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా శుక్రవారం జరగాల్సిన అఫ్గాన్-ఐర్లాండ్, ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మ్యాచ్‌లు రద్దవ్వడం వెనుక క్రికెట్ ఆస్ట్రేలియా కుట్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

క్రికెట్ ఆస్ట్రేలియాపై అనుమానాలు..

క్రికెట్ ఆస్ట్రేలియాపై అనుమానాలు..

మెల్‌బోర్న్ వేదికగా జరగాల్సిన ఈ రెండు మ్యాచ్‌లు బంతి పడకుండానే రద్దయ్యాయి. ఈ రెండు కూడా గ్రూప్-1కు చెందిన మ్యాచ్‌లే కావడంతో అనుమానాలు రేకెత్తాయి. దీనికి తోడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్.. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రశ్నించడం, నిర్వాహణ లోపం ఉందని నిలదీయడంతో ఈ అనుమానాలకు బలం చేకూరింది. మెల్‌బోర్న్ మైదానాన్ని పూర్తిగా కప్పేసే రూఫ్ సౌకర్యం ఉన్నా.. ఎందుకు ఉపయోగించలేదని వాన్ ప్రశ్నించాడు.

రూఫ్ టాప్ సౌకర్యం ఉన్నా..

శ్రీలంక వంటి చిన్న దేశాల్లో కూడా పెద్ద వర్షాల అనంతరం మైదానాలను మ్యాచ్‌లకు సిద్దం చేశారని, కానీ అధునాతన సౌకర్యాలు కలిగిన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ను మాత్రం సిద్దం చేయలేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో గత రెండు రోజులు రూఫ్‌తో ఎందుకు కప్పి ఉంచలేదని ప్రశ్నించాడు. ఇది ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు అనిపిస్తుందని వాన్ తన సందేహాన్ని వెలిబుచ్చాడు.

వాన్ ట్వీట్‌తో రచ్చ...

ఇక వాన్ ట్వీట్స్‌తో క్రికెట్ అభిమానులు సైతం క్రికెట్ ఆస్ట్రేలియాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టోర్నీలో ముందడుగు వేసేందుకే సీఏ ఈ అడ్డదారిని ఎంచుకుందని, కీలక మ్యాచ్‌ ఆడకుండా షేరింగ్ పాయింట్‌తో రేసులోకి వచ్చిందని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్రూప్ 1లో న్యూజిలాండ్ మూడు పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ నాలుగు జట్లు ఒక్కో విజయం సాధించడంతో పాటు రద్దయిన మ్యాచ్‌ల కారణంగా మరో పాయింట్ సాధించాయి. రెండు పాయింట్లతో శ్రీలంక ఐదో స్థానంలో ఉండగా.. అఫ్గాన్ రెండు మ్యాచ్‌లు రద్దవ్వడంతో ఆఖరి స్థానంలో ఉంది.

ఆసీస్ సెమీస్ అవకాశాలు సజీవం..

ఆసీస్ సెమీస్ అవకాశాలు సజీవం..

మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయిన తర్వాత సెమీస్ అవకాశాలు న్యూజిలాండ్, ఆసీస్‌కే ఎక్కువగా ఉన్నాయి. కివీస్‌కు 61 శాతం చాన్స్ ఉండగా.. ఆసీస్‌కు 37 శాతం, శ్రీలంకకు 34 శాతం ఉంది. న్యూజిలాండ్‌తో 89 పరుగుల ఘోర పరాజయంతో వెనకడుగు వేసిన ఆసీస్.. వర్షం కారణంగా మూడు మ్యాచ్‌లు రద్దవ్వడంతో అనూహ్యంగా రేసులోకి వచ్చింది. కీలక ఇంగ్లండ్‌తో నేడు ఆడాల్సిన మ్యాచ్‌ను వర్షంతో తప్పించుకున్న ఆసీస్.. తదుపరి మ్యాచ్‌ల్లో పసికూనలు ఐర్లాండ్, అఫ్గాన్‌లతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధిస్తే ఆసీస్‌కు తిరుగుండదు.

Story first published: Friday, October 28, 2022, 18:51 [IST]
Other articles published on Oct 28, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+