టెస్ట్ క్రికెట్ ఆడే దమ్ము పాకిస్థాన్‌కు లేదు.. అదో దిగువ శ్రేణి టీమ్: మైఖేల్ వాన్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మరోసారి పాకిస్థాన్ టెస్ట్ టీమ్‌పై విమర్శలు గుప్పించాడు. టెస్ట్ క్రికెట్ ఆడే సత్తా పాకిస్థాన్‌కు లేదన్నాడు. పాకిస్థాన్ సెకండ్ డివిజన్ కౌంటీ క్రికెట్ టీమ్‌ను తలపిస్తుందని అభిప్రాయపడ్డాడు. మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ లార్డ్స్ వేదికగా రెండో టెస్ట్ ఆడుతోంది.
అయితే ఈ మ్యాచ్‌లోనూ పాకిస్థాన్ బ్యాటింగ్ విభాగం దారుణంగా విఫలమైంది. తొలి టెస్ట్ తరహాలోనే తొలి ఇన్నింగ్స్‌లో 110 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ బాబర్ ఆజామ్ (8)తో సహా బ్యాటర్లంతా విఫలమయ్యారు. అజాన్ అవైస్(102 బంతుల్లో 7 ఫోర్లతో 46), సౌద్ షకీల్(16) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్(4/11) నాలుగు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్(3/26) మూడు వికెట్లు పడగొట్టాడు. జోష్ టంగ్(2/27) రెండు వికెట్లు తీసాడు.

పాకిస్థాన్ పేలవ బ్యాటింగ్‌పై స్పందించిన మైఖేల్ వాన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 'పాకిస్థాన్ బ్యాటింగ్ మరి దారుణంగా ఉంది. సెకండ్ డివిజన్ కౌంటీ క్రికెట్ కంటే దారుణంగా ఉంది వారి బ్యాటింగ్. ఇది ఒక టెస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ లైనప్ అన్ని చెప్పేంత స్థాయిలో కూడా వాళ్ల బ్యాటింగ్ చేయడం లేదు.'అని వాన్ విమర్శలు గుప్పించాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. జోర్డాన్ కాక్స్(55), జేమీ స్మిత్(61) హాఫ్ సెంచరీతో రాణించగా.. గస్ అట్కిన్సన్(45), జోష్ టంగ్(30 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ అబ్బాస్(4/73) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ అలీ(3/86) మూడు వికెట్లు పడగొట్టాడు. ఖుర్రమ్ షెహ్‌జాద్, అలీ ఉస్మాన్ తలో వికెట్ తీసారు.
తొలి టెస్ట్‌లో పేలవ బ్యాటింగ్‌తో పాకిస్థాన్ ఇన్నింగ్స్ 103 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కనీసం 200 పరుగులు చేయలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులు చేసిన పాక్.. రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులే చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రెండో టెస్ట్‌లోనూ పాకిస్థాన్ ఘోర పరాజయం దిశగా కొనసాగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

