ఇంగ్లండ్‌పై వాన్ సెటైర్స్...
తాజాగా ఫస్ట్ టెస్ట్ వర్షంతో డ్రా అవ్వడంతో తనదైన శైలిలో ఇంగ్లండ్ జట్టుపై సెటైర్లు పేల్చాడు. ఆదివారం వర్షం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో వాన్ ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 'చూస్తుంటే ఇక్కడ భారతీయులను వర్షం రక్షిస్తున్నట్టు ఉంది కదా'అని కన్నుకొడుతున్న ఏమోజీతో ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌ను చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. వాన్ భారత్‌కు వ్యతిరేకంగా ట్వీట్ చేశారనుకున్నారు. కానీ అతను పరోక్షంగా వర్షంతో ఇంగ్లండ్ బతికిపోయిందని వెల్లడించాడు.

వాన్‌పై ఫ్యాన్స్ ఫైర్..
వాన్ ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకున్న భారత అభిమానులు అతనిపై ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకొందరేమో అతని సెటైర్‌కు తగ్గట్లు కామెంట్ చేస్తూ ట్రోల్ చేశారు. ఇంగ్లండ్ జట్టును వర్షం ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుందని ఒకరంటే.. భారత్ గెలిస్తే తట్టుకోలేవని ఇంకొకరన్నారు. వాన్ ఇలా భారత్‌కు అనుకూలంగా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని, ఇది కూడా వ్యూహంలో భాగమైతే కాదు కదా! అని సందేహించారు. ఇక మైకేల్ వాన్ అంచనాలన్నీ తలికిందులవుతుంటాయి. ఆసీస్ గడ్డపై భారత్ క్లీన్ స్వీప్ అవుతుందని వాన్ అంచనా వేయగా.. భారత్ యువ ఆటగాళ్లతో చారిత్రాత్మక విజయాన్నందుకుంది.

జోరూట్ ఒక్కడే..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన జో రూట్ సేనను కోహ్లీసేన దెబ్బకొట్టింది. జస్ప్రీత్ బుమ్రా (4/46), మహ్మద్ షమి (3/28) చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే ఇంగ్లండ్ కుప్పకూలింది. అనంతరం కేఎల్ రాహుల్ (84), రవీంద్ర జడేజా (56) అద్భుత బ్యాటింగ్‌కు జస్‌ప్రీత్ బుమ్రా విలువైన పరుగులు జోడించడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 278 పరుగులు చేసి 95 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా (5/64) చెలరేగినప్పటికీ.. కెప్టెన్ జో రూట్ (172 బంతుల్లో 109; 14 ఫోర్లు) సెంచరీతో ఇంగ్లండ్ 303 పరుగులు చేసింది. దాంతో భారత్ ముందు 209 పరుగుల సాధారణ లక్ష్యం నమోదైంది.

వరుణుడు.. ఇంగ్లండ్ 12వ ప్లేయర్
209 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన భారత్ నాలుగో రోజు ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. ధాటిగా ఆడిన రాహుల్ (38 బంతుల్లో 26; 6 ఫోర్లు) నిష్క్రమించగా... రోహిత్ (12 బ్యాటింగ్), పుజారా (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో తొమ్మిది వికెట్లు.. విజయానికి కావాల్సింది 157 పరుగులు.. ఒక రోజు ఆట మిగిలి ఉండటంతో కోహ్లీసేన మ్యాచ్ గెలవడం పక్కా అని అంతా భావించారు. కానీ వరణుడు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇంగ్లండ్ 12వ ప్లేయర్‌గా భారత విజయాన్ని అడ్డుకొని అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు.


Click it and Unblock the Notifications












