అప్పుడు..ఇప్పుడు ఫుల్ షాట్ ఆడే బ్యాట్స్‌మన్ ఎవరు?
పైగా దీనికి ‘మీ అభిప్రాయం ప్రకారం గతం, ప్రస్తుత తరంలో పుల్ షాట్ ఆడే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ఎవరు?'అంటూ ప్రశ్నించింది. అయితే ఈ ఫొటోలో వివియన్ రిచర్డ్స్, రికీ పాంటింగ్, హెర్షల్ గిబ్స్‌లతో పాటు టీమిండియా సారథి విరాట్ కోహ్లీల ఫుల్ షాట్ పోజ్‌లను ఆఫ్షన్‌లుగా ఉంచింది.

రోహిత్ అసంతృప్తి..
అయితే ఈ పోస్ట్‌పై టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ట్వీట్‌కు బదులిస్తూ 'ఇందులో ఒకరు మిస్ అయ్యారు. నా అంచనా ప్రకారం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం అంత సులువు కాదు' అని పేర్కొన్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కన్నా రోహిత్ పుల్ షాట్ బాగా ఆడగలడని.. అతణ్ని విస్మరించి ఐసీసీ తప్పు చేసిందని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ కామెంట్ చేశారు.
దీంతో తమ తప్పిదం గుర్తించిన ఐసీసీ.. రోహిత్ ట్విట్‌కు బదులుగా రోహిత్ నిజాయితిగల ఆటగాడు అంటూ తాను ఆడిన పుల్ షాట్‌కు సంబంధిన ఓ వీడియోను పోస్ట్ చేసింది. 'ఫెయిర్ ప్లే, రోహిత్' అనే వ్యాఖ్యను కూడా జోడించింది.

మైఖెల్ వాన్ వ్యంగ్యం..
ఇక మైఖెల్ వాన్ మాత్రం తమ సూపర్ ప్లేయర్స్ బెన్ స్టోక్స్, జో రూట్, జోనీ బెయిర్ స్టో, జాస్ బట్లర్‌ల పక్కన పెట్టి మరీ ఐసీసీ ట్వీట్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇంగ్లండ్‌కే చెందిన జాక్ లీచ్.. అత్యుత్తమ పుల్‌షాట్ కొట్టే ఆటగాడని బదులిచ్చాడు.
ఇది కొంత ఆశ్చర్యాన్ని గురి చేసినా అభిమానులకు మాత్రం నవ్వులు తెప్పించింది. ఐసీసీకి సరిగానే సమాధానం ఇచ్చాడని అనుకోవడం పలువురు అభిమానుల వంతైంది.

76 పరుగుల భాగస్వామ్యంలో చేసింది ఒక్క పరుగే..
ఎందుకంటే జాక్ లీచ్ ప్రొఫెషనల్ టాపార్డర్ బ్యాట్స్‌మన్ కాదు.. అతను స్పిన్నర్. గతేడాది జరిగిన యాషెస్ సిరీస్‌లో బెన్ స్టోక్స్‌తో కలిసి అతను 76 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఇందులో అతను చేసిన పరుగులు ఒక్కటంటే ఒకటే. 17 బంతులు ఆడిన జాక్ లీచ్ కేవలం పరుగు మాత్రమే చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది.లీచ్ సాయంతో స్టోక్స్(135) ఇంగ్లండ్‌కు అద్భుత విజయాన్నందించాడు. 362 పరుగుల లక్ష్యాన్ని లీచ్ సాయంతో ఒక వికెట్‌తోనే ఛేదించాడు. దీంతో ఐసీసీకి వాన్ జాక్ లీచ్ పేరు సూచించడం వ్యంగ్యమేనని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications












