WTC Final: టీమిండియాను కించపర్చిన మైకేల్ వాన్.. అడ్డదారిలో ప్రపంచకప్ గెలవలేదంటున్న ఫ్యాన్స్!

సౌతాంప్టన్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మరోసారి భారత జట్టుపై విద్వేశాన్ని వెల్లగక్కాడు. అవకాశం దొరికినప్పుడల్లా టీమిండియాను తక్కువ చేస్తూ మాట్లాడే మైకేల్ వాన్ తాజాగా ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌ను ఉద్దేశించి కూడా కోహ్లీసేనపై విషాన్ని చిమ్మాడు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నామే ప్రారంభం కావాల్సిన ఈ మెగా ఫైనల్‌కు వర్షం ఆటంకం కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఈ మెగా మ్యాచ్ వేదికైన సౌతాంప్టన్‌లో గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దాంతో అంపైర్లు టాస్ వేయకుండానే ఫస్ట్ డే ఫస్ట్ సెషన్ ఆటను రద్దు చేశారు. దాంతో డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు వర్షంతో బతికిపోతుందని మైకేల్ వాన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై భారత అభిమానులు, మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గోతికాడి కప్పల్లా చూస్తున్నారా?
భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అయితే తనదైన శైలిలో బదులిచ్చాడు. లాగాన్ సినిమాలోని ఓ సన్నివేశాన్ని మీమ్‌గా బదులిచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ను ఇతర జట్లు గోతికాడి కప్పల్లా చూస్తున్నాయనే అర్థం వచ్చేలా క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ఇక మైకేల్ వాన్ ఏదీ చెప్పినా దానికి వ్యతిరేకంగా జరుగుతుందని, అతను భారత్ ఓడిపోతుందనుకుంటున్నాడని, చాంపియన్‌గా నిలిచేది కోహ్లీసేననే అని కామెంట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు కూడా ఇదే తరహా అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేశాడని, కోహ్లీ లేకుండా గెలవలేదని ఖునీ రాగాలు తీసాడని గుర్తు చేస్తున్నారు.
నోరు మూయించినా సిగ్గురాలేదు..
కానీ యువ ఆటగాళ్లు దుమ్మురేపి చారిత్రాత్మక విజయంతో మైకేల్ వాన్ నోరు మూయించారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని కామెంట్ చేస్తున్నారు. మైకేల్ వాన్‌కు ఇండియా అంటేనే ఎక్కడో కాలుతదని, కోహ్లీసేన విజయాన్ని ఏ మాత్రం తట్టుకోలేడని కామెంట్ చేస్తున్నారు. అతనికి బర్నాల్ ఇవ్వాలని సూచిస్తున్నారు. భారత జట్టు ఆడే ఏ మ్యాచ్‌కైనా అతను వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడని, భారత అభిమానుల చేత తిట్లు తినంది వాన్‌కు నిద్రపట్టదని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
తొండాట ఆడలేదు..
ఇంకొందరైతే ఇంగ్లండ్‌లా అడ్డదారిలో ప్రపంచకప్ గెలవలేదని, తొండాటతో విశ్వవిజేతగా నిలవలేదని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. అంపైర్ తప్పుడు నిర్ణయాలు, బౌండరీ కౌంట్ వంటి అడ్డదారులతో ఇంగ్లండ్ 2019 వన్డే ప్రపంచకప్ గెలిచిందని గుర్తు చేస్తున్నారు. విలువ తక్కువ పనులు, క్రీడా స్పూర్తి దెబ్బతీసేలా భారత జట్టు ఎప్పుడూ వ్యవహరించలేదని, నలుగురు తలెత్తుకునేలా ఆడిందని చురకలంటిస్తున్నారు. భారత జట్టు విజయాలను మైకేల్ వాన్ ఏ మాత్రం ఓర్వలేకపోతున్నాడని, అసలు డబ్ల్యూటీసీ ఫైనల్ రావడమే అతనికి ఇష్టం లేదని కామెంట్ చేస్తున్నారు. ఇక ఇంగ్లండ్‌తో సిరీస్ సందర్బంగా స్పిన్ పిచ్‌లు రెడీ చేశారని వాన్ గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే.
మ్యాచ్ విషయానికొస్తే.. ప్రస్తుతం వరుణుడు కాస్త కరుణించాడు. మరికొద్దిసేపట్లో అంపైర్లు మైదానాన్ని పరిశీలించనున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఈ రోజు మ్యాచ్ షురూ అయితే ఓ సెషన్ ఆట కొనసాగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications