Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Michael Vaughan: నీ బజ్‌బాల్‌ బ్యాటింగ్‌ల మన్నువడ.. ఇదేం దిక్కుమాలిన అప్రోచ్!

లార్డ్స్: ఇంగ్లండ్ బజ్‌బాల్ అప్రోచ్‌పై ఆ జట్టు మాజీ కోచ్ మైఖేల్ వాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏం బజ్‌బాల్ ఏమో కానీ ఇంగ్లండ్ బ్యాటర్లు చేజేతులా వికెట్లు పారేసుకుంటున్నారని మండిపడ్డాడు. వారు ఔటైన తీరు చూస్తుంటే ఏ మాత్రం బుద్ది లేకుండా ఆడుతున్నట్లు అనిపిస్తుందని విమర్శించాడు.

278/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 325 పరుగులకు కుప్పకూలింది. 47 పరుగుల వ్యవధిలోనే చివరి 6 వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆటలోను 188/1 ‌తో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్.. దూకుడు ఆడే క్రమంలో మూడు వికెట్లు కోల్పోయింది. బజ్‌బాల్ బ్యాటింగ్ పేరిట ఆసీస్ బౌలర్లకు వికెట్లు ఇచ్చుకోవడంపై మైఖేల్ వాన్ మండిపడ్డాడు.

Michael Vaughan criticises England’s Bazball approach in 2nd Ashes Test

'ఇంగ్లండ్ జట్టు రియలిస్టిక్‌‌గా ఉండాలి. ఎంటర్‌టైన్ చేసేందుకు తెలివితక్కువగా ఆడకూడదు. 188 పరుగుల వరకు ఇంగ్లండ్ అద్భుతంగా ఆడింది. ప్రాపర్ షాట్లతో పరుగులు రాబట్టింది. ఆసీస్ బౌలర్లకు పిచ్ నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. దాంతో వాళ్లు షార్ట్ బాల్స్ ఎదురుదాడికి దిగగా.. ఇంగ్లండ్ బ్యాటర్లు బద్దిలేకుండా ఆడి ఔటయ్యారు.

క్రీజులో సెట్ అయ్యాక చెత్త షాట్లతో వెనుదిరిగారు. సెంచరీకి చేరువైన బెన్ డక్కెట్, జోరూట్, ఓలీ పోప్ షార్ట్ బాల్స్‌కు ఔటయ్యారు. గేమ్‌లో ఆధిపత్యం చెలాయించే స్థితికి చేరి ఒక్కసారిగా నేలకు పడ్డారు. బజ్‌బాల్ బ్యాటింగ్ ఏమో కానీ ఆసీస్ బౌలర్లకు కష్టం లేకుండా ఇంగ్లండ్ బ్యాటర్లు ఔటవుతున్నారు'అని మైఖేల్ వాన్ మండిపడ్డాడు.

91 పరుగులు ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(58 బ్యాటింగ్), డేవిడ్ వార్నర్(25) శుభారంభం అందించగా.. మార్నస్ లబుషేన్(30) ఆచితూచి ఆడాడు. ఈ ఇద్దరూ ఔటైనా క్రీజులోకి వచ్చిన స్మిత్‌తో కలిసి ఉస్మాన్ ఖవాజా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. 46 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 2 వికెట్లకు 130 పరుగులు చేసింది.

ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్‌(184 బంతుల్లో 15 ఫోర్లతో 110) సెంచరీతో చెలరేగగా.. ట్రావిస్ హెడ్(73 బంతుల్లో 14 ఫోర్లతో 77), డేవిడ్ వార్నర్(66) హాఫ్ సెంచరీలతో రాణించారు.

Story first published: Friday, June 30, 2023, 22:10 [IST]
Other articles published on Jun 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+