Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లండ్‌పై భారత్ గెలవదు: మాజీ క్రికెటర్

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా భారత్‌తో జరిగే సెమీఫైనల్-2లో ఇంగ్లండ్ విజయం సాధిస్తుందని ఆ జట్టు మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ జోస్యం చెప్పాడు. భారత్ కంటే ఇంగ్లండ్ స్పిన్ విభాగం పటిష్టంగా ఉందని, ఫీల్డింగ్ కూడా అద్భుతమని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ ఫామ్‌లోకి వస్తే ఆ జట్టుకు తిరుగుండదని అభిప్రాయపడ్డాడు.

సూపర్-8 దశలో ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌లు మూడు గెలిచి గ్రూప్-2 టాపర్‌గా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లను ఇంగ్లండ్ అతికష్టం మీద గెలిచింది. గ్రూప్ దశలో వెస్టిండీస్‌ చేతిలో ఓటమిపాలైన ఇంగ్లండ్.. నేపాల్ చేతిలో తృటిలో ఓటమిని తప్పించుకుంది. ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా గురువారం జరిగే సెమీఫైనల్-2లో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి.

ఇంగ్లండ్ గెలుస్తోంది..

తాజాగా ఈ మ్యాచ్ గురించి ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన మైఖేల్ వాన్.. ఇంగ్లండ్‌కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జోస్యం చెప్పాడు. 'భారత్ కంటే ఇంగ్లండ్‌ జట్టుకే మెరుగైన స్పిన్ అటాక్ ఉంది. వరుణ్ చక్రవర్తిపై ప్రత్యర్థులు ఎదురుదాడి చేస్తున్నారు. ఈ టోర్నమెంట్‌లో స్పిన్ పరంగా లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, విల్ జాక్స్ అత్యుత్తమ స్పిన్ త్రయంగా నిలిచింది.

ఈ త్రయం ఇంగ్లండ్‌కు గెలిచే మార్గాలను కనుగొంటుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ డెడ్ రబ్బర్ (ఫలితం ప్రాధాన్యత లేనిది) అయినప్పటికీ, ఆ గెలుపు జట్టు ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ముంబైలో ఇంగ్లండ్ విజయం సాధిస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇంగ్లండ్ ఫీల్డింగ్ అద్భుతంగా ఉంది. మైదానంలో వారు చాలా అప్రమత్తంగా కనిపిస్తున్నారు. వికెట్ల మధ్య పరుగు తీయడంలో కూడా ఇంగ్లండ్ అదరగొడుతోంది. ఆటగాళ్లుగా నియంత్రించగలిగే చిన్న చిన్న విషయాలను ఇంగ్లండ్ చాలా చక్కగా చేస్తోంది.

Michael Vaughan Claims England s Superior Spin Attack Can Defeat India in T20 World Cup 2026 Semi-Final

ఆ ఒక్కటే లోటు..

ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ ప్రదర్శన నిలకడగా లేకపోవడం, జోస్ బట్లర్ ఫామ్ మాత్రమే ఆందోళనగా మారింది. బట్లర్ అతిగా ఆలోచించకుండా తన సహజ సిద్ధమైన ఆటను ఆడాలి. ఫామ్‌లో లేనప్పుడు టెక్నిక్ గురించి ఆలోచిస్తుంటాం. జోస్ బట్లర్ కంటి చూపు, చేతుల సమన్వయం మీద ఆధారపడి ఆడే ఆటగాడు. కేవలం బంతిని ఏకాగ్రతతో గమనిస్తూ, బంతికి తగ్గట్టుగా స్పందించాలి.

అతను ఈ మధ్య కాలంలో ఆడని షాట్లు 'ర్యాంప్ షాట్లు'. వాంఖడే స్టేడియం పిచ్ ఆ షాట్‌కు బాగా సెట్ అవుతుంది. ఆ షాట్ ఆడాలంటే మీరు బంతిని నిశితంగా గమనించాలి. అతను ఫామ్‌లో ఉన్నప్పుడు ఆ షాట్లను ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఆడుతాడు.'అని మైఖేల్ వాన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, March 4, 2026, 16:27 [IST]
Other articles published on Mar 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+