అతన్ని తీసుకోకపోవడం టీమిండియా ఘోర తప్పిదం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌లో భారత జట్టు.. సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన టీమిండియా.. కుల్దీప్‌కు మాత్రం అవకాశం ఇవ్వలేదు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు ఆస్ట్రేలియా పర్యటనలో సత్తా చాటిన వాషింగ్టన్ సుందర్ వైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ మొగ్గు చూపాడు. ఇక ఆఖరి నిమిషంలో అక్షర్ పటేల్ మోకాలి నొప్పితో జట్టుకు దూరం కాగా.. అతని స్థానంలో ఆశ్చర్యకరంగా కేవలం ఒకే టెస్ట్ ఆడిన షాబాజ్ నదీమ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిలో అశ్విన్ మినహా ఇద్దరు అనుభవం లేమి ఆటగాళ్లు కావడంతో తొలి రోజు ఆటలో టీమిండియా తేలిపోయింది. దాంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయంపై అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకెప్పుడు ఆడుతాడు?
టీమిండియా తుది జట్టులోకి కుల్దీప్ యాదవ్‌ను తీసుకోకపోవడం హాస్యాస్పదకంగా ఉందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ ట్వీట్ చేశాడు. 'కుల్దీప్‌ను జట్టులోకి తీసుకోకుండా టీమిండియా హాస్యాస్పదకరమైన నిర్ణయం తీసుకుంది. కీలక ఆటగాళ్లు గాయాలతో దూరమై.. స్వదేశంలో జరుగుతున్న మ్యాచ్‌లకు కూడా కుల్దీప్‌ను ఆడించకపోతే.. అతను ఇంకెప్పుడు ఆడుతాడు?'అని వాన్ ట్విటర్ వేదికగా ప్రశ్నించాడు.

టీమిండియా వ్యూహం ఏంటో..
సీనియర్ స్నిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను కాదని యువ ఆటగాళ్లతో బరిలోకి దిగడం వెనుక ఉన్న టీమిండియా వ్యూహం ఏంటో తనకు అర్థం కాలేదని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న ఎమ్మెస్కే.. తొలి రోజు ఆట అనంతరం భారత తుది జట్టుపై సహచర కామెంటేటర్, మాజీ క్రికెటర్ వెంకటపతి రాజుతో కలిసి చర్చించాడు. కుల్దీప్ యాదవ్‌ను తీసుకుంటే భారత్‌కు కలిసొచ్చేదని అభిప్రాయపడ్డాడు. ఇక మాజీ స్పిన్నర్ అయిన వెంటకపతి రాజు కూడా ఎమ్మెస్కే అభిప్రాయంతో ఏకీభవించాడు.

స్టాండ్ బై బౌలర్‌కు..
కుల్దీప్ యాదవ్ ఎంపిక చేయకపోవడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని భారత ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ట్వీట్ చేశాడు.'షాబాజ్ నదీమ్ ఎంపిక సరైందే. అతడు ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌ను ఇబ్బందిపెట్టగలడు. అయితే కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. టీమ్ మేనేజ్మెంట్ వైఖరి చూస్తే ఓ విషం స్పష్టంగా తెలుస్తోంది. కుల్దీప్‌కు అంత ప్రాముఖ్యం ఇవ్వట్లేదు' అని పేర్కొన్నాడు. ఆకాశ్ చోప్రా సైతం భారత తుది జట్టుపై విస్మయం వ్యక్తం చేశాడు. జడేజా లేనప్పుడు కూడా కుల్దీప్‌కు అవకాశం రాకపోతే అతను ఇంకెప్పుడు ఆడుతాడని ప్రశ్నించాడు.

ఫస్ట్ చాయిస్ స్పిన్నర్ ..
ఇక రెండేళ్ల క్రితం కుల్దీప్ యాదవ్ భారత ఫస్ట్ చాయిస్ స్పిన్నర్‌గా ప్రశంసలందుకున్నాడని మహ్మద్ కైఫ్ గుర్తు చేశాడు. 'సరిగ్గా రెండేళ్ల క్రితం, టెస్టుల్లో భారత్ ఫస్ట్ చాయిస్ స్పిన్నర్ అంటే కుల్దీప్ యాదవ్ అన్న పేరు వినిపించింది. కానీ ఇప్పుడు జట్టులో చోటు కోసం అతడు పోరాడుతున్నాడు. అయితే అంతగా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఆర్ అశ్విన్, రిషబ్ పంత్ పట్టుదలగా పోరాడిన తర్వాతే జట్టులోకి తిరిగి వచ్చారు. ధైర్యంగా ఉండు కుల్దీప్' అని ట్వీట్ చేశాడు. ఇక తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. జోరూట్(128 నాటౌట్) సూపర్ సెంచరీతో 263/3 భారీ స్కోర్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications