
రైనా, ఫాఫ్ డుప్లెసిస్‌తో మాట్లాడిన హస్సీ
ముఖ్యంగా చెన్నై సూపర్‌కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మరింత మందికి పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. చెన్నై జట్టులో మొదట బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీకి వైరస్ సోకింది. దాంతో జట్టంతా వారం రోజుల కఠిన క్వారంటైన్‌కు వెళ్లింది.
కానీ బాలాజీ వైరస్ సోకిన మరుసటి రోజే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీకీ పాజిటివ్ రావడం కలకలం సృష్టించింది. ఈ ఫలితానికి రెండు రోజుల ముందు ఆయన సురేశ్ రైనా, ఫాఫ్ డుప్లెసిస్‌తో 15-20 నిమిషాలు మాట్లాడాడు. అంతేకాకుండా మరికొందరు ఆటగాళ్లతోనూ చర్చించాడని సమాచారం. దీంతో చెన్నై జట్టులో మరింత మందికి పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఒక్కరినీ కలిసిన సాహా
సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా విషయంలోనూ ఇలాగే జరిగినట్టు తెలుస్తోంది. సాహాలో లక్షణాలు కనిపించగానే జట్టు నుంచి విడదీసి ఐసోలేషన్‌కు పంపించారు. కానీ అంతకన్నా ముందే అతడు జట్టులోని ప్రతి ఒక్కరినీ కలిసినట్టు సమాచారం.
అందుకే జట్టు సభ్యులు భయపడి ముంబై ఇండియన్స్‌తో ఆడేందుకు ఇష్టపడలేదని ఫ్రాంచైజీ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. సాహాతో కలిసి స్టార్ ఆటగాళ్లు అందరూ మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇది చూస్తుంటే.. సన్‌రైజర్స్ జట్టులో చాలా మంది ఆటగాళ్లు వైరస్ బారిన పడేట్టే కనిపిస్తోంది. ఏదేమైనా మరో 3-4 రోజుల్లో ఎవరికీ వైరస్ ఉందో తేలనుంది.
IPL 2021: జీవితంలో ఎప్పుడూ ఇంత నిస్సహాయంగా లేను: రైనా భావోద్వేగం

1000 కోట్లు విరాళం ఇవ్వాలి
బీసీసీఐపై బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వందనా షా అనే న్యాయవాది పిల్ దాఖలు చేశారు. ప్రాణవాయువు సరఫరా, వైద్య పరికరాల కోసం రూ.1000 కోట్లు విరాళం ఇవ్వాలని అందులో కోరారు. ఎవరి మాటలనూ పట్టించుకోకుండా దుందుడుకు శైలితో లీగ్ నిర్వహించిన బీసీసీఐ క్షమాపణలు చెప్పాలని ఆమె కోరారు. ప్రస్తుతం శ్మశాన వాటికలపై భారం పెరగడంతో ప్రత్యేకంగా శ్మశాన వాటికలు ఏర్పాటు చేసేలా బోర్డుకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. ప్రజల సంక్షేమంపై బీసీసీఐ వైఖరేంటో తెలియజేయాలని పిటిషన్లో వందనా ప్రశ్నించారు. తానూ క్రికెట్‌కు అభిమానినే అని.. అత్యంత సున్నితం, సమస్యాత్మక పరిస్థితుల్లో నిర్వహించడమే సరికాదన్నారు.

పకడ్బందీగా బబుల్ లేకపోవడం వల్లే
ఐపీఎల్ 2020కు బ్రిటన్‌కు చెందిన రెస్ట్రారా అనే కంపెనీకి బబుల్ బాధ్యతలు నిర్వహించింది. ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది, మైదాన, హోటళ్ల నిర్వాహకులు.. ఇలా లీగ్‌లో భాగమైన అందరినీ బుడగలోకి తీసుకొచ్చింది ఆ కంపెనీ. బయటి వ్యక్తులు ఎవ్వరూ బుడగ లోపలికి రాకుండా అత్యంత జాగ్రత్తగా చూసుకుంది.
అలాగే మూడు వేదికలకే మ్యాచ్‌లు పరిమితం చేశారు. విమాన ప్రయాణాల అవసరం లేకుండా రోడ్డు మార్గాల్లోనే ఒక వేదిక నుంచి మరో వేదికకు వెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవడంతో ఎక్కడా ఎవరికీ వైరస్ సోకకుండా చూసుకుంది. ఇప్పుడు స్వదేశంలో పకడ్బందీగా బబుల్ లేకపోవడం వల్లే ఐపీఎల్ 2021 అర్ధంతరంగా ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం అందరికీ కలిపి ఉమ్మడి బబుల్ ఏర్పాటు చేయకపోవడమే అసలు సమస్య.


Click it and Unblock the Notifications












