For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ రోజు ధోనీ ఏడ్చేశాడు.. అతని స్పీచ్ నాకింకా గుర్తుంది: మైక్ హస్సీ

 Michael Hussey recalls seeing CSK captain MS Dhoni get emotional in 2018

ముంబై: స్పాట్ ఫిక్సింగ్ మకిలితో రెండేళ్లు నిషేధానికి గురై 2018లో రీఎంట్రీ ఇచ్చినప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడుతూ మహేంద్ర సింగ్ ధోనీ ఎమోషనల్ అయ్యాడని ఆ జట్టు మాజీ ప్లేయర్, బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ అన్నాడు. ఆ సీజన్ తమకు చాలా ప్రత్యేకమని చెప్పిన మైక్ హస్సీ.. ఆ విజయాన్ని తలుచుకుంటేనే రోమాలు నిక్కబొడుస్తాయని తెలిపాడు. తాజాగా సీఎస్‌కే వెబ్‌సైట్‌తో మాట్లాడిన అతను ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 2018 సీజన్ తనకు ఎంతో ప్ర్యతేకమైందని చెప్పాడు.

స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంతో..

స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంతో..

2013 స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ పాత్ర ఉందని నిర్దారించిన ఐపీఎల్ నిర్వాహకులు ఆ జట్టుపై రెండేళ్లపాటు నిషేధం విధించారు. దాంతో 2016, 2017 సీజన్‌లకు చెన్నై జట్టు దూరంకాగా.. ధోనీ పుణే సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. రెండేళ్ల నిషేధం అనంతరం చెన్నై రీఎంట్రీ ఇవ్వగా ధోనీ మళ్లీ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. జట్టును అద్భుతంగా నడిపించి టైటిల్ కూడా అందించాడు. ఇక అదే సీజన్‌తో బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన మైక్ హస్సీ.. 2018 సీజన్ చాలా ప్రత్యేకమని చెప్పాడు.

 ధోనీ ఏడ్చేశాడు..

ధోనీ ఏడ్చేశాడు..

'ఒక్కటని చెప్పలేను. సీఎస్‌కేతో ప్రయాణంతో చాలా మధుర జ్ఞాపకాలున్నాయి. చాంపియన్‌షిప్ విన్నింగ్ ఫోటోల్లో 2018 సీజన్ మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే నిషేధం కారణంగా మేం లీగ్‌కు రెండేళ్లు దూరమయ్యాం. అది మాకు కమ్ బ్యాక్ సీజన్. ఆ సీజన్ ఆరంభంలో జట్టును ఉద్దేశించి ధోనీ ఇచ్చిన స్పీచ్ నాకింకా గుర్తుంది. ఎందుకంటే ఆ సమయంలో ధోనీ కళ్లలో నీళ్లు తిరిగాయి. జట్టు గురించి మాట్లాడుతూ ధోనీ భావోద్వేగానికి గురయ్యాడు. ఏడ్చేశాడు కూడా. ఆ క్షణమే ఈ సీజన్‌లో ఏదో అద్భుతం జరిగిపోతుందనిపించింది.

ఎవరీకి సాధ్యం కాలేదు...

ఎవరీకి సాధ్యం కాలేదు...

అది ప్రత్యేకమైన సీజన్. ఏం జరిగిందని తలుచుకుంటేనే గూజ్‌బంప్స్ వస్తాయి. ఐపీఎల్‌లోనే ఆ సీజన్ మాకు కమ్‌బ్యాక్. ఆ సీజన్‌లో ధోనీ అద్బుతంగా ఆడాడు. ఏబీ డివిలియర్స్ నా ఫెవరేట్. ధోనీ కూడా అంతే. ఎందుకంటే ఈ ఇద్దరూ మిడిల్ ఆర్డర్‌లో ఆడుతారు. చాలా మంది దిగ్గజాలు, మిడిల్ ఆర్డర్‌లో పరుగులు సాధించలేకపోయారు. ఎందుకంటే వాళ్లంతా టాపార్డర్‌లో ఆడడానికే ప్రాధాన్యం ఇస్తారు. ఏబీ డివిలియర్స్ సాధించినది, చాలా మంది ప్లేయర్లకు సాధ్యం కాని విషయం. ఎందుకంటే 20 బంతుల్లో మ్యాచ్ అయిపోతుందనగా క్రీజులోకి వచ్చి 70 పరుగులు చేస్తాడు. అతనో అసాధారణమైన ఆటగాడు. ధోనీ కూడా అంతే. కాకపోతే లెక్కలతో ధోనీ ఆడుతాడు. ఈ ఇద్దరూ సాధించినది టీ20 క్రికెట్ చరిత్రలో దిగ్గజాలకు కూడా సాధ్యం కాలేదు.

 మళ్లీ కెప్టెన్‌గా..

మళ్లీ కెప్టెన్‌గా..

కెప్టెన్‌గా నాలుగు టైటిళ్లు అందించిన ధోనీ.. జట్టును 9సార్లు ఫైనల్‌కు చేర్చాడు. 2020 సీజన్ మినహా ప్రతీ సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరాడు. టీమ్ భవిష్యత్తు కోసం ఈ సీజన్‌కు ముందు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొని రవీంద్ర జడేజాకు అందజేశాడు. కానీ వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడికి గురైన జడేజా సారథ్యం చేయలేనని మళ్లీ ధోనీకే అప్పజెప్పాడు. దాంతో మరోసారి సారథిగా జట్టును నడిపించేందుకు ధోనీ సిద్దమయ్యాడు. సన్‌రైజర్స్‌తో అద్భుత విజయాన్నందుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆర్‌సీబీ చేతిలో ఓడి ప్లే ఆఫ్స్ అవకాశాలను చేజార్చుకున్నాడు.

Story first published: Friday, May 6, 2022, 16:31 [IST]
Other articles published on May 6, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+