Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డకెట్.. అతని ఆటను చూశావా? బౌలర్ తల మీద నుంచి సిక్స్ కొట్టేవాడు: ఆసీస్ మాజీ క్రికెటర్

ఇంగ్లండ్ బజ్‌బాల్ అప్రోచ్‌ను చూసి టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడుతున్నాడని బెన్ డకెట్ చేసిన వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ మండిపడ్డాడు. బజ్‌బాల్‌కు ముందే టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియా దూకుడుగా బ్యాటింగ్ చేసిందని గుర్తు చేశాడు. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్.. బౌలర్ తల మీద నుంచి సిక్స్ కొట్టేవాడని తెలిపాడు.

ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెన్ డకెట్ వ్యాఖ్యలను క్లార్క్ తప్పుబట్టాడు. 'బెన్ డకెట్ ఓ బచ్చాగాడు. 20 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా ఆట తీరు ఎలా ఉండేదో అతనికి పెద్దగా తెలియదు. మాథ్యూ హెడెన్, మైఖేల్ స్లేటర్, రికీ పాంటింగ్, డామియన్ మార్టిన్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ గురించి అతను పెద్దగా వినలేదు అనుకుంటా.

Michael Clarke slams Ben Duckett for his bazball comment on Yashasvi Jaiswal

వీళ్లు టెస్ట్ క్రికెట్ ఎలా ఆడేవారో అతను తెలుసుకోవాలి. రివర్స్ స్వీప్, ర్యాంప్ షాట్, స్విచ్ హిట్‌ లాంటివి ఆడి అదే దూకుడైన ఆట అనుకుంటున్నారేమో. మాథ్యూ హెడెన్ వచ్చిన వెంటనే నేరుగా బౌలర్ తల మీద నుంచి సిక్స్ కొట్టేవాడు. అతనికి స్వీప్, ర్యాంప్ షాట్స్ అవసరం లేదు. టెస్ట్ బుక్ షాట్స్‌తోనే బౌలర్లను వణికించేవాడు.'అని మైఖేల్ క్లార్క్ చెప్పుకొచ్చాడు.

ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. అతని ఇన్నింగ్స్‌పై స్పందించిన బెన్ డకెట్... ఇంగ్లండ్ బజ్‌బాల్ వ్యూహాన్ని ప్రత్యర్థి ఆటగాళ్లు సైతం కాపీ కొడుతున్నారని తెలిపాడు. ఈ వ్యాఖ్యలపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు సైతం విమర్శలు గుప్పించారు. నాజిర్ హుస్సేన్ అయితే యశస్వి జైస్వాల్.. ఇంగ్లండ్‌ను చూసి నేర్చుకోలేదని, పేదరికాన్ని జయించిన అతన్ని చూసే ఇంగ్లండ్ ఆటగాళ్లు నేర్చుకోవాలని చురకలంటించాడు.

Michael Clarke slams Ben Duckett for his bazball comment on Yashasvi Jaiswal

ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన మూడు మ్యాచ్‌ల్లో భారత్ రెండింటిలో విజయం సాధించగా.. ఇంగ్లండ్ ఒక మ్యాచ్‌లో గెలిచింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి రాంచీ వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది.

Story first published: Wednesday, February 21, 2024, 20:17 [IST]
Other articles published on Feb 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+