ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండా ఆడితే ఇలానే ఉంటది.. ఆసీస్ ఓటములపై క్లార్క్ ఫైర్!

న్యూఢిల్లీ: ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండా ఆడితే ఘోర పరాజయాలే ఎదురవుతాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంపై క్లార్క్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇతర దేశాల పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితుల అలవాటు పడేందుకు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతారని, కానీ ఆస్ట్రేలియా ఒక్క వామప్ మ్యాచ్ కూడా ఆడకుండా బరిలోకి దిగి మూల్యం చెల్లించుకుందన్నాడు. నాగ్‌పూర్ టెస్ట్‌లో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఓడిన ఆసీస్.. ఢిల్లీ టెస్ట్‌లో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.
రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక పరుగు ఆధిక్యం సాధించిన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 52 పరుగుల వ్యవదిలోనే తొమ్మిది వికెట్లను కోల్పోయింది. ముఖ్యంగా స్వీప్ షాట్లను కొట్టేందుకు యత్నించి మూల్యం చెల్లించుకుంది. ఆసీస్ వరుస పరాజయాలపై స్పందించిన క్లార్క్.. జట్టు తప్పిదాలను ఎత్తి చూపాడు.

ప్రాక్టీస్ మ్యాచ్ లేకపోవడం..
'ఢిల్లీ టెస్టు రెండో ఇన్నింగ్స్ చూశాక నాకేమీ ఆశ్చర్యం కలిగలేదు. ఎందుకంటే ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడకుండా ఆసీస్ బరిలోకి దిగింది. జట్టు చేసిన అతి పెద్ద తప్పిదం ఇదే. పరిస్థితులను అర్థం చేసుకోవాలంటే కనీసం ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ అయినా ఆడాలి. అలాగే, తొలి టెస్టుకు తుది జట్టు ఎంపికలో ఘోర తప్పిదం చేశారు.
ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగారు. రెండో టెస్టులో స్వీప్ షాట్లు ఆడే ప్రయత్నం చేసి మూల్యం చెల్లించుకున్నారు. ఇలాంటి పిచ్ పరిస్థితుల్లో స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ఆడటం సరైంది కాదు. స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవాలంటే స్ట్రెయిట్ బ్యాట్ ఆడాలి. గతంలో నేను ఇలానే బ్యాటింగ్ చేసేవాడిని.

స్వీప్ షాట్లు ఆడటమే..
స్పిన్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌లపై ఎలా బ్యాటింగ్ చేయాలనేది భారత్‌ను చూసి ఆసీస్ నేర్చుకోవాలి. ప్రత్యర్థి ఆటగాళ్లుగా మనం టీమిండియా బ్యాటింగ్‌ను చూడటానికి ఇష్టపడం. కానీ, క్లిష్టపరిస్థితుల్లో ఎలా ఆడాలనే దానికి ఉదాహరణగా టీమిండియా బ్యాటింగ్‌ను తీసుకోవాలి.
రెండో ఇన్నింగ్స్‌లో కనీసం మనం 200 పరుగులైనా చేసి ఉంటే భారత్‌పై ఆధిక్యం ప్రదర్శించేందుకు అవకాశం ఉండేది. కానీ, అలా జరగకుండా కేవలం 113 పరుగులకే ఆలౌటయ్యాం. తదుపరి మ్యాచుల్లోనైనా తప్పిదాల నుంచి గుణపాఠాలను నేర్చుకొని విజయాలబాట పట్టాలి.' అని మైకేల్ క్లార్క్ ఆకాంక్షించాడు.

బీసీసీఐ మోసం చేస్తుందని..
రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్, జడేజా బౌలింగ్‌లో స్వీప్ షాట్లు ఆడబోయి ఆరుగురు ఆసీస్ బ్యాటర్లను పెవిలియన్ చేరారు. 11 బంతుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయింది. 10 రోజుల ముందే భారత్‌కు వచ్చిన ఆసీస్ ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ ఆడలేదు. బీసీసీఐ సరైన స్పిన్ పిచ్ ఇవ్వదని, పేస్ పిచ్‌లను తయారు చేసి మోసం చేస్తుందని వామప్ మ్యాచ్‌లను బహిష్కరించింది.
గత పర్యటనలో ఇలానే చేసిందని ఈ సారి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడలేదు. ఆసీస్ ఆటగాళ్లు సైతం ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఇక భారత బౌలర్ల శైలిలో వేసే దేశవాళీ స్పిన్నర్లతో ప్రాక్టీస్ చేసిన ఆసీస్.. ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications