
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మంగళవారం జరిగిన ఉత్కంఠకర మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దాదాపు విజయం ఖాయమనుకున్న దశలో ముంబై నయా హిట్టర్ టిమ్ డేవిడ్ రనౌటవ్వడం జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. అయితే ఈ మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్.. టిమ్ డేవిడ్ ఔటవ్వడాన్ని తట్టుకోలేకపోయింది.
ఈ మ్యాచ్‌ను స్టేడియంలోని కార్పొరేట్ బాక్స్‌లో కూర్చుని ఎంజాయ్ చేసిన సారా టెండూల్కర్.. ఆఖర్లో ముంబై ఓడిపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం సారాకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన సోదరుడు అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ముంబైయి ఇండియన్స్ టీమ్‌లోనే ఉండగా.. సచిన్ టెండూల్కర్ ఆ టీమ్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే సారా తన సోదరుడు అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం చేస్తాడని భావించి ఈ మ్యాచ్‌కు వచ్చినట్లు తెలుస్తోంది.

నటరాజన్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో నాలుగు సిక్సర్లు బాదిన టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46) ఒంటిచేత్తో ముంబైని గెలిపించేలా కనిపించాడు. కానీ.. ఆ ఓవర్ ఆఖరి బంతికి సింగిల్ తీసి.. నెక్ట్స్ ఓవర్‌కు స్ట్రైక్ తీసుకోవాలని ఆశించిన టిమ్ డేవిడ్ లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ రనౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో.. మళ్లీ మ్యాచ్‌లోకి వచ్చిన హైదరాబాద్.. చివరి వరకూ పట్టు వీడలేదు.
ముంబైని గెలిపించేలా కనిపించిన టిమ్ డేవిడ్.. బంతి బౌలర్ నటరాజన్ చేతిని తాకి వికెట్ల సమీపంలో ఉన్నా సాహసోపేతంగా సింగిల్ కోసం పరుగెత్తి రనౌటయ్యాడు. దాంతో.. ముంబై డగౌట్‌లోని సహచర ఆటగాళ్లు సైతం 'సింగిల్ అవసరమా?' అంటూ అసహనం వ్యక్తం చేస్తూ కనిపించారు. సారా టెండూల్కర్ కూడా తొలుత ఆ రనౌట్‌ని నమ్మలేనట్లు చూసి.. అనంతరం టిమ్ డేవిడ్ పెవిలియన్‌కి వెళ్తున్నప్పుడు ఎమోషనల్ అయిపోయింది. ఇక అర్జున్ టెండూల్కర్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది.