Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs SRH: నిప్పులు చెరిగిన హార్దిక్ పాండ్యా, పియూష్ చావ్లా.. తడబడిన సన్‌రైజర్స్!

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 174 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. హార్దిక్ పాండ్యా(3/31), పియూష్ చావ్లా(3/33) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది.

ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 48), ప్యాట్ కమిన్స్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2సిక్స్‌లతో 35 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా, పియూష్ చావ్లా మూడేసి వికెట్లు తీయగా.. బుమ్రా, అన్షుల్ కంబోజ్ తలో వికెట్ తీసారు.

MI vs SRH Pat Cummins powers SRH to 173 8 after Hardik-Piyush show

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ శుభారంభం దక్కింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సూపర్ బ్యాటింగ్‌తో వేగంగా పరుగులు రాబట్టాడు. అయితే అరంగేట్ర ప్లేయర్ అన్షుల్ కంబోజ్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్‌కు లైఫ్ లభించింది. అతను ఔటైన బంతి నోబాల్ కావడం సన్‌రైజర్స్‌కు కలిసొచ్చింది.

ఈ అవకాశంతో చెలరేగిన ట్రావిస్ హెడ్ వేగంగా పరుగులు చేశాడు. 55 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదరకంగా మారిన ఈ జోడీని జస్‌ప్రీత్ బుమ్రా విడదీసాడు. అభిషేక్ శర్మ(11)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి మయాంక్ అగర్వాల్ రాగా.. కంబోజ్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్‌కు మరో లైఫ్ లభించింది. అతను ఇచ్చిన సునాయస క్యాచ్‌ను ముంబై ప్లేయర్ నేలపాలు చేశాడు.

MI vs SRH Pat Cummins powers SRH to 173 8 after Hardik-Piyush show

అయితే ఆ మరుసటి బంతికే మయాంక్ అగర్వాల్(5)ను కంబోజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డితో కలిసి ఆచితూచి ఆడుతున్న ట్రావిస్ హెడ్‌ను పియూష్ చావ్లా క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దూకుడుగా ఆడుతున్న నితీష్ కుమార్ రెడ్డి(20)ని హార్దిక్ పాండ్యా బౌన్సర్‌తో క్యాచ్ ఔట్‌గా బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే డేంజరస్ హెన్రీచ్ క్లాసెన్(2)ను పియూష్ చావ్లా పెవిలియన్ చేర్చాడు. దాంతో 96 పరుగులకే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదు వికెట్లు కోల్పోయింది.

మార్కో జాన్సెన్(17)‌ను హార్దిక్ పాండ్యా క్లీన్ బౌల్డ్ చేయగా.. అతని మరుసటి ఓవర్‌లో షెహ్‌బాజ్ అహ్మద్(10) క్యాచ్ ఔటయ్యాడు. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ సన్వీర్ సింగ్(4)ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దింపగా.. ప్యాట్ కమిన్స్ దూకుడుగా ఆడాడు. చివరి ఓవర్‌లో ఓ సిక్స్, ఫోర్ బాది జట్టు స్కోర్‌ను 170 పరుగుల మార్క్‌ను ధాటించాడు.

Story first published: Monday, May 6, 2024, 21:34 [IST]
Other articles published on May 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+