ముంబై: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు వివ్రాంత్ శర్మ(47 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69), మయాంక్ అగర్వాల్(46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఆకాశ్ మధ్వాల్(4/37) నాలుగు వికెట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్‌ను అడ్డుకున్నాడు. క్రిస్ జోర్డాన్‌కు ఓ వికెట్ దక్కింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు వివ్రాంత్ శర్మ, మయాంక్ అగర్వాల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. కెరీర్‌లో తొలి ఐపీఎల్ ఇన్నింగ్స్ ఆడిన వివ్రాంత్ శర్మ అసాధారణ బ్యాటింగ్ చెలరేగాడు. మయాంక్ అగర్వాల్ సైతం ముంబై బౌలర్లపై విరుచుకుపడటంతో పవర్ ప్లేలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది.

పవర్ ప్లే అనంతరం ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ స్పిన్నర్లను బరిలోకి దించినా ఫలితం లేకపోయింది. ఈ ఇద్దరూ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 36 బంతుల్లోనే వివ్రాంత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. 32 బంతుల్లో మయాంక్ అగర్వాల్ అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో వరుసగా విఫలమైన మయాంక్ అగర్వాల్.. ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు.
క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ఆకాశ్ మధ్వాల్ విడదీసాడు. వివ్రాంత్ శర్మను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చడంతో తొలి వికెట్‌కు నమోదైన 140 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
హెన్రీచ్ క్లాసెన్‌ను అప్‌ది ఆర్డర్‌లో పంపించగా.. మయాంక్ అగర్వాల్ చెలరేగాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న అతన్ని మధ్వాల్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే గ్లేన్ ఫిలిప్స్‌ను క్రిస్ జోర్డాన్ ఔట్ చేయగా.. క్రీజులోకి ఎయిడెన్ మార్క్‌రమ్ వచ్చాడు. అయితే మధ్వాల్ 19వ ఓవర్‌లో.. హెన్రీచ్ క్లాసెన్(13 బంతుల్లో 2 ఫోర్లతో 18)ను క్లీన్ బౌల్డ్ చేసి భారీ స్కోర్‌కు అడ్డుకట్ట వేసాడు. ఆ మరుసటి బంతికే హ్యారీ బ్రూక్(0)ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు.
క్రిస్ జోర్డాన్ వేసిన ఆఖరి ఓవర్‌లో సన్వీర్ సింగ్ బౌండరీ కొట్టగా.. మార్క్‌రమ్ ఆఖరి బంతికి సిక్స్ బాది జట్టు స్కోర్‌ను 200కు చేర్చాడు.