
మంచి స్టార్ట్..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు మంచి శుభారంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ ధాటిగా ఆడి మంచి ఆరంభాన్ని అందించారు. భువనేశ్వర్ కుమార్ వేసిన ఫస్ట్ ఓవర్‌లోనే డికాక్ రెండు బౌండరీలు బాదగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ వేసిన మూడో ఓవర్‌లో వరుస బంతుల్లో 4, 6 బాది రోహిత్ జోరు కనబర్చాడు. అనంతరం ఈ జోడీ ఆడపాదడపా బౌండరీలు బాదేయడంతో పవర్ ప్లేలో ముంబై వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది.

చెలరేగిన శంకర్..
పవర్ ప్లే ముగిసిన వెంటనే ప్రమాదకరంగా మారిన ఈ జోడీని విడదీసేందుకు కెప్టెన్ డేవిడ్ వార్నర్.. విజయ్ శంకర్‌ను రంగంలోకి దింపాడు. అతని ఓవర్‌లో డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్‌కు యత్నించిన రోహిత్.. బౌండరీ లైన్ వద్ద విరాట్ సింగ్‌కు చిక్కాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 55 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ బౌండరీతో ఖాతా తెరిచాడు. ఆ తర్వాత శంకర్ వేసిన 9వ ఓవర్‌లో ఎక్స్‌ట్రా కవర్ మీదుగా ఓ భారీ సిక్సర్ కొట్టిన సూర్య ఆ మరుసటి బంతికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

కట్టడి చేసిన సన్‌రైజర్స్..
క్రీజులోకి ఇషన్ కిషన్ రాగా.. రషీద్, మజీబ్ కట్టు దిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల వేగం తగ్గింది. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన ఓపెనర్ డికాక్.. ముజీబ్ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్‌కు యత్నించి సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ జే సుచిత్‌కు చిక్కాడు. ఇది హైదరాబాద్ తరఫున ముజీబ్‌కు ఫస్ట్ ఐపీఎల్ వికెట్. ఇక క్రీజులోకి డేంజరెస్ కీరన్ పొలార్డ్ రాగా.. హైదరాబాద్ బౌలర్లు బౌండరీలు ఇవ్వకుండా ఒత్తిడి పెంచారు. అయితే ముజీబ్ వేసిన 17వ ఓవర్‌లో పొలార్డ్ భారీ సిక్సర్ బాదాడు. అయితే అదే ఓవర్‌లో ఇషాన్ కిషన్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. హార్దిక్ పాండ్యా క్రీజులోకి రాగా భువీ ఓవర్‌లో పొలార్డ్ బౌండరీ బాదడంతో 11 రన్స్ వచ్చాయి.

పొలార్డ్ మెరుపులు..
ఖలీల్ వేసిన 19వ ఓవర్ తొలి బంతికే బౌండరీ బాదిన పొలార్డ్.. మూడో బంతిని మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడగా.. సులువైన క్యాచ్‌ను విజయ్ శంకర్ నేలపాలు చేశాడు. అయితే ఆ మరుసటి బంతికే హార్దిక్ పాండ్యా .. విరాట్ సింగ్ సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. భువీ వేసిన చివరి ఓవర్‌లో పొలార్డ్ రెండు భారీ సిక్సర్లు బాదడంతో ముంబై 150 పరుగుల మార్క్‌ను అందుకుంది. చివరి 5 ఓవర్లలో ముంబై 2 వికెట్లకు 49 రన్స్ చేయగా.. అందులో 17 రన్స్ చివరి ఓవర్‌లోనే వచ్చాయి. విజయ్ శంకర్ క్యాచ్ నేలపాలు చేయడంతో హైదరాబాద్ మూల్యం చెల్లించుకుంది. ఈ స్లో వికెట్‌పై ఈ టార్గెట్‌ను చేధించడం చాలా కష్టం.


Click it and Unblock the Notifications












