Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs SRH: ఇషాన్ కిషన్ విధ్వంసం.. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!

Ishan Kishan Races to Fastest Fifty

అబుదాబి: ముంబై ఇండియన్స్ యువ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ చెలరేగాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 4,4,4,4,2,4,1,4 వరుస బౌండరీలతో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా ముంబై ఇండియన్స్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో తనతో పాటు కీరన్ పొలార్డ్ పేరిట ఉన్న(17 బంతుల్లో హాఫ్ సెంచరీ) రికార్డును అధిగమించాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదిన మూడో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇక ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.

ఈ సీజన్‌లో కీరన్ పొలార్డ్‌(ముంబై ఇండియన్స్‌) 17 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా.. పృథ్వీ షా (18 బంతుల్లో ), యశస్వి జైశ్వాల్‌(19 బంతుల్లో ) హాఫ్ సెంచరీలు బాదారు. ఇక ముంబై ఇండియన్స్‌ తరపున ఫాస్టెస్ట్‌ హాఫ్ సెంచరీ సాధించడం ఇషాన్‌కు ఇది రెండోసారి. 2016లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ అందుకున్న ఇషాన్‌.. తాజా మ్యాచ్‌ల్లో 16 బంతుల్లోనే సాధించాడు. ఆ తర్వాత పొలార్డ్‌ ( 2016లో 17 బంతులు ), హర్దిక్‌ పాండ్యా( 2019లో 17 బంతులు), పొలార్డ్‌(2021లో 17 బంతులు) ఉన్నారు.

ఇషాన్ కిషన్(32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 84), సూర్యకుమార్ యాదవ్(40 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82) విధ్వంసకర బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 236 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 235 పరుగులు చేసింది. ఇషాన్, సూర్యకుమార్ ధాటికి సన్‌రైజర్స్ బౌలర్లు పరుగులిచ్చుకోవడంలో పోటీపడ్డారు. సిద్దార్థ్ కౌల్ తన నాలుగు ఓవర్ల కోటాలో 56 పరుగులు ఇచ్చుకున్నాడు. రెండు వికెట్లు తీసిన రషీద్ ఖాన్ సైతం 40 రన్స్ ఇచ్చాడు. అభిషేక్ శర్మ మాత్రం ఒకే ఓవర్ వేసి రెండు వికెట్లు తీసి 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

Story first published: Friday, October 8, 2021, 22:23 [IST]
Other articles published on Oct 8, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+