Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs SRH: కొంపముంచిన క్లాసెన్ అత్యుత్సాహం..!(వీడియో)

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(23 బంతుల్లో 5 ఫోర్లతో 31) ఔటై పెవిలిన్ చేరి మళ్లీ నాటౌట్‌గా తిరిగి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ హెన్రీచ్ క్లాసెన్ అత్యుత్సాహం కారణంగా ర్యాన్ రికెల్టన్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. సన్‌రైజర్స్ స్పిన్నర్ జీషన్ అన్సారీ వేసిన 7వ ఓవర్‌లో ఈఘటన చోటు చేసుకుంది.

ఈ ఓవర్ ఏడో బంతికి ర్యాన్ రికెల్టన్ కవర్స్‌లో క్యాచ్ ఇవ్వగా.. ప్యాట్ కమిన్స్ అద్భుతంగా అందుకున్నాడు. దాంతో సన్‌రైజర్స్ ఆటగాళ్లు సంబరాలు చేసుకోగా.. ర్యాన్ రికెల్టన్ పెవిలియన్ చేరాడు. మరో బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. కానీ ఇక్కడే హైడ్రామా చోటు చేసుకుంది. ఈ బంతిని నోబాల్‌గా ప్రకటించిన అంపైర్.. ర్యాన్ రికెల్టన్‌ను నాటౌట్‌గా తేల్చుతూ మళ్లీ క్రీజులోకి ఆహ్వానించాడు. దాంతో రికెల్టన్ క్రీజులోకి రాగా.. సూర్య వెనుదిరిగాడు.

MI vs SRH IPL 2025 Why Ryan Rickelton Was Given Not-Out After Heinrich Klaasen Blunder
Photo Credit: screen grab for JioHotstar

ఈ ఘటన అందర్నీ ఆశ్చర్యపరిచింది. రికల్టన్ షాట్ కొట్టే ముందే వికెట్ కీపర్ హెన్రీచ్ క్లాసెన్ తన గ్లోవ్స్‌ను వికెట్ల ముందుకు తీసుకురావడాన్ని థర్డ్ అంపైర్ గమనించాడు. నిబంధనల ప్రకారం షాట్ ఆడే వరకు కీపర్ గ్లోవ్స్ స్టంప్స్ ముందుకు తీసుకురావద్దు. స్టంపౌట్ చేయాలనే అత్యుత్సాహంతో వికెట్ కీపర్లు ఈ తప్పిదం చేస్తుంటారు. క్లాసెన్ తప్పిదంతో బతికిపోయిన రికెల్టన్.. హర్షల్ పటేల్ వేసిన మరుసటి ఓవర్‌లో రెండు బౌండరీ‌లు బాది క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు మాత్రమే చేసింది. అభిషేక్ శర్మ(28 బంతుల్లో 7 ఫోర్లతో 40), హెన్రీచ్ క్లాసెన్(28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 37) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్(2/14) రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం ముంబై ఇండియన్స్ 18.1 ఓవర్లలోనే 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. విల్ జాక్స్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36), ర్యాన్ రికెల్టన్(23 బంతుల్లో 5 ఫోర్లతో 31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్(3/26) మూడు వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగా(2/36) రెండు వికెట్లు పడగొట్టాడు. హర్షల్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది.

Story first published: Friday, April 18, 2025, 7:08 [IST]
Other articles published on Apr 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+