MI vs SRH: రోహిత్ శర్మను ఊరిస్తున్న అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో డేవిడ్ భాయ్.!

చెన్నై: వరుసగా రెండు ఓటములతో డీలా పడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ 2021 సీజన్‌లో కఠిన సవాల్‌కు సిద్దమైంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా మరో గంట వ్యవధిలో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో బలమైన ముంబై ఇండియన్స్‌ను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలిచి టోర్నీలో బోణీ కొట్టాలని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది. మరోవైపు కేకేఆర్‌తో ఓటమి అంచున పుంజుకొని థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసిన ముంబై రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. దాంతో ఈ మ్యాచ్ ప్రేక్షకులకు కావాల్సిన మజాను అందించనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల కెప్టెన్లను అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.

డేవిడ్ వార్నర్ 50
ఐపీఎల్ అంటేనే పూనకంతో ఊగిపోయే సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి డేవిడ్ వార్నర్.. ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో విఫలమైన సెకండ్ మ్యాచ్‌లో రాణించి ఫామ్ అందుకున్నాడు. అచ్చొచ్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై హాఫ్ సెంచరీ చేసి గాడిలో పడ్డాడు. ఇది ఈ ఆసీస్ స్టార్‌కు ఐపీఎల్‌లో 49వ ఫిఫ్టీకాగా.. 50 హాఫ్ సెంచరీలు చేసేందుకు అతను అడుగుదూరంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగే నేటి మ్యాచ్‌లో అతను హాఫ్ సెంచరీ చేస్తే.. ఐపీఎల్ చరిత్రలో 50 హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా నిలుస్తాడు.

144 మ్యాచ్‌ల్లోనే..
ఈ అత్యధిక హాఫ్ సెంచరీల జాబితాలో వార్నర్(49) తర్వాత శిఖర్ ధావన్(42), విరాట్ కోహ్లీ(39), సురేశ్ రైనా(39), ఏబీ డివిలియర్స్(38) ఉన్నారు. 144 మ్యాచ్‌ల్లో వార్నర్ 49 హాఫ్ సెంచరీలు బాదడం విశేషం.
డేవిడ్ వార్నర్- 49 హాఫ్ సెంచరీలు(144 మ్యాచ్‌లు)
శిఖర్ ధావన్-42 హాఫ్ సెంచరీలు (178 మ్యాచ్‌లు)
విరాట్ కోహ్లీ-39 అర్థశతకాలు(194 మ్యాచ్‌లు)
సురేశ్ రైనా-39 హాఫ్ సెంచరీలు(195 మ్యాచ్‌లు)
ఏబీ డివిలియర్స్-38 హాఫ్ సెంచరీలు (171 మ్యాచ్‌లు)

20 రన్స్ చేస్తే..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో 20 పరుగులు చేస్తే అత్యధిక పరుగుల జాబితాలో డేవిడ్ వార్నర్‌ను అధిగమించనున్నాడు. ఈ జాబితాలో వార్నర్ 5311 రన్స్‌తో మూడో స్థానంలో ఉండగా.. రోహిత్ 5292 పరుగులో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ 5944 రన్స్‌తో టాప్‌లో ఉండగా.. సురేశ్ రైనా 5430 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. శిఖర్ ధావన్ 5291 రన్స్‌తో ఐదో స్థానంలో ఉన్నాడు.
1.విరాట్ కోహ్లీ- 194 మ్యాచ్‌ల్లో 5944
2. సురేష్ రైనా 195 మ్యాచ్‌ల్లో 5430
3. డేవిడ్ వార్నర్ 144 మ్యాచ్‌ల్లో 5311
4. రోహిత్ శర్మ 202 మ్యాచ్‌ల్లో 5292
5.శిఖర్ ధావన్ 178 మ్యాచ్‌ల్లో 5291.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications