చెత్త కెప్టెన్సీ..
రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ పిచ్‌ను సరిగ్గా రీడ్ చేయకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుత సీజన్‌లో కొనసాగుతున్న చేజింగ్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నానని చెప్పాడు. అయితే ఇది పెద్ద తప్పుడు నిర్ణయమో తెలుసుకోవడానికి రోహిత్ శర్మకు ఎంతో సేపు పట్టలేదు. రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మన్ పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్నారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ముంబై బౌలర్లను చెడుగుడు ఆడారు. రాజస్థాన్ రాయల్స్ విధ్వంసంతో రోహిత్ సైతం కెప్టెన్‌గా గాడి తప్పాడు. ఫీల్డింగ్ సెటప్‌తో పాటు సరైన టైమ్‌లో సరైన్ బౌలర్లతో బౌలింగ్ చేయించలేకపోయాడు.
బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్...
జోస్ బట్లర్(68 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100) సెంచరీతో చెలరేగగా.. షిమ్రాన్ హెట్‌మైర్(14 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 35), సంజూ శాంసన్(21 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 30)తుఫాను ఇన్నింగ్స్ ఆడారు. దాంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. చివర్లో బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ 200 మార్క్ చేరలేకపోయింది. పొలార్డ్, బసిల్ థంపీ ఒకే ఓవర్‌లో వరుస బౌండరీలతో 26 పరుగులు సమర్పించుకున్నారు. పిచ్ బ్యాటింగ్‌కు అంత ఫ్లాట్‌గా ఉంది. ఇలాంటి వికెట్‌పై రోహిత్ ముందుగా బ్యాటింగ్ చేయకుండా పెద్దతప్పిదం చేశఆడని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వడాపావ్ పాచిపోతుందా?
భారీ లక్ష్యచేధనకు దిగిన ముంబైకి రోహిత్ రూపంలో భారీ షాక్ తగిలింది. సిక్సర్‌తో దూకుడు కనబర్చిన రోహిత్(10) ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో నెటిజన్లు రోహిత్‌ను ఓ ఆటఆడుకుంటున్నారు. ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. రోహిత్‌కు ఇష్టమైన వడపావ్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఏం రోహిత్ వడాపావ్ పాచిపోతుందా? అంత త్వరగా ఔటయ్యావు? అని రూపొందించిన మీమ్ వైరల్‌గా మారింది.
ఈ జట్టుతో టైటిల్ గెలువు..
ఐదు టైటిళ్లు గెలిచిన రోహిత్ శర్మ.. తాజా జట్టుతో ఈ సారి చాంపియన్ నిలవాలని ఆర్‌సీబీ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సవాల్ విసురుతున్నారు. ఆ ఐదు టైటిళ్లు రోహిత్ శర్మ ఒక్కడివల్ల రాలేదని, బలమైన జట్టుతోనే సాధ్యమయ్యాయని చురకలంటిస్తున్నారు. గత సీజన్ వరకు ముంబైకి చాలా బలమైన జట్టు ఉందని, ఈ సారి వేలంలో వారు సరైన ఆటగాళ్లను తీసుకోలేకపోయారని దాంతో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. సరైన టీమ్ లేకుంటే ఏ కెప్టెన్ కూడా ఏం చేయలేడని, అనవసరంగా విరాట్ కోహ్లీపై అసత్య ప్రచారం చేసి కెప్టెన్సీ నుంచి తప్పుకునేలా చేశారని మండిపడుతున్నారు.


Click it and Unblock the Notifications
