Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs RR: ట్రెంట్ బౌల్ట్, చాహర్ తీన్మార్.. ముంబై ఇండియన్స్ బేజార్!

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న బౌలర్లలో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ట్రెంట్ బౌల్ట్(3/22), యుజ్వేంద్ర చాహల్(3/11) ధాటికి క్రీజులో నిలబడలేకపోయారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులు చేసింది.

కెప్టెన్ హార్దిక్ పాండ్యా(21 బంతుల్లో 6 ఫోర్లతో 34), తిలక్ వర్మ(29 బంతుల్లో 2 సిక్స్‌లతో 32) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఏకంగా ముగ్గురు బ్యాటర్లు గోల్డెన్ డకౌటయ్యారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో బౌల్ట్, చాహల్‌కు తోడుగా.. నండ్రే బర్గర్ రెండు, ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ తీసారు.

MI vs RR Rajasthan Royals need 126 to win in IPL 2024 clash vs Mumbai Indians

దెబ్బతీసిన బౌల్ట్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ట్రెంట్ బౌల్ట్ ఊహించని షాకిచ్చాడు. వరుస బంతుల్లో రోహిత్ శర్మ(0), నమన్ ధిర్(0)‌లను గోల్డెన్ డక్‌గా వెనుదిరిగారు. రోహిత్ శర్మ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగ్గా.. నమన్ ధిర్ వికెట్ల ముందు దొరికిపోయాడు. తొలి ఓవర్‌లోనే 2 వికెట్లు కోల్పోవడంతో ముంబై ఇండియన్స్ తమ ఇంపాక్ట్ ప్లేయర్‌గా డెవాల్డ్ బ్రెవిస్(0)ను బరిలోకి దింపింది.

కానీ అతను దారుణంగా విఫలమయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో బర్గర్‌కు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. బర్గర్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే ఇషాన్ కిషన్(16) కూడా కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో ముంబై ఇండియన్స్ 20 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

MI vs RR Rajasthan Royals need 126 to win in IPL 2024 clash vs Mumbai Indians

హార్దిక్, తిలక్ ఆదుకున్నా..
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ధాటిగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇద్దరూ రాజస్థాన్ బౌలర్లపై వరుస బౌండరీలతో ఎదురుదాడికి దిగారు. 56 పరుగులతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని చాహల్ విడదీసాడు.

హార్దిక్ పాండ్యాను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పియూష్ చావ్లా(3)ను ఆవేశ్ ఖాన్ ఔట్ చేయగా.. తిలక్ వర్మను చాహల్ పెవిలియన్ చేర్చాడు. చాహల్ బౌలింగ్‌లోనే గెరాల్డ్ కోయిట్జీ(4) కూడా వెనుదిరగడంతో ముంబై స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది.

Story first published: Monday, April 1, 2024, 21:33 [IST]
Other articles published on Apr 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+