
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. డ్యూ ప్రభావం ఉండకున్నా లీగ్ ట్రెండ్‌ను ఫాలోఅవుతున్నానని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. దీనికి సరైన కారణం ఏం లేదు. టోర్నీలోని ట్రెండ్‌ను చూస్తున్నాం. లక్ష్యాన్ని చూసి ఆడటం కొంత సులువు. మంచు ప్రభావం ఏం ఉండదు. ఇది మంచి పిచ్ అని భావిస్తున్నాం. గత మ్యాచ్‌లో చేసిన తప్పిదాలను ఇక్కడ సరిదిద్దుకోవాలనుకుంటున్నాం. ప్రతీ గేమ్ మాకు మంచి అవకాశమే. మాది యువ ఆటగాళ్లతో కూడిన జట్టు.. ప్రతీ మ్యాచ్‌కు ఎంతో కొంత నేర్చుకుంటూ మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తాం. ఇక ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. దాంతో ఈ మ్యాచ్‌కు సూర్యకుమార్ యాదవ్ దూరమయ్యాడు.
ముందుగా బ్యాటింగ్ చేసే సవాల్‌ను సంతోషంగా స్వీకరిస్తున్నామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చెప్పాడు. అయితే టాస్ గెలిస్తే ముందు ఫీల్డింగ్ తీసుకునేవాళ్లమన్నాడు. ఏది ఏమైనా బ్యాటింగ్‌ను ఆస్వాదించేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపాడు. వేలంలో మంచి ఆటగాళ్లను తీసుకోవడంతో తమ జట్టు బలంగా ఉందన్నాడు. తుది జట్టులో ఒక మార్పు చోటు చేసుకుందని నాథన్ కౌల్టర్ నైల్ స్థానంలో నవ్‌దీప్ సైనీ ఆడుతున్నాడని చెప్పాడు.
ముంబై, ఆర్‌ఆర్ జట్లు ప్రస్తుత సీజన్‌లో చెరో మ్యాచ్ ఆడగా, ముంబై.. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో పరాజయం, రాజస్థాన్ రాయల్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 61 పరుగుల తేడాతో అద్భుత విజయం నమోదు చేశాయి. ఈ మ్యాచ్‌లో ఆర్‌ఆర్‌పై గెలిచి ఐపీఎల్ 2022 సీజన్‌లో బోణీ కొట్టాలని రోహిత్ సేన భావిస్తుండగా, సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ లీగ్‌లో రెండో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతుంది.
ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మొత్తం 25 మ్యాచ్‌లు జరగ్గా 13 మ్యాచ్‌ల్లో ముంబై, 11 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ గెలుపొందాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
తుది జట్లు (అంచనా):
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్), షిమ్రోన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, నవ్‌దీప్ సైనీ, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చహల్
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, అన్‌మోల్ ప్రీత్ సింగ్, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, మురుగన్ అశ్విన్, టైమల్ మిల్స్, జస్ప్రీత్ బుమ్రా, బాసిల్ థంపి, డానియల్ సామ్స్