ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని సంజూ శాంసన్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం.
వికెట్ చాలా ఫ్రెష్‌గా ఉంది. ఈ సీజన్‌లో ఇక్కడ ఇదే తొలి మ్యాచ్. ఈ పిచ్‌పై పేసర్లకు అడ్వాంటేజ్ ఉండనుంది. గత రెండు మ్యాచ్‌ల్లోలానే ఈ గేమ్‌లోనూ తమ ప్రణాళికలను అమలు చేస్తాం. తుది జట్టులో ఒక మార్పు చేశాం. ఫిట్‌నెస్ సమస్యలతో సందీప్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో బర్గర్ తుది జట్టులోకి వచ్చాడు.'అని సంజూ శాంసన్ తెలిపాడు.

టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా తెలిపాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. ఈ మ్యాచ్ కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాం. మేం టీమ్ భవిష్యత్తుపైనే ఫోకస్ పెట్టాం. మా విధానాన్ని మాత్రమే అనుసరిస్తున్నాం.
బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతూ.. తమ ఆటను ఆస్వాదించడంపై మాత్రమే దృష్టి సారించాం.
ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నాం.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. అయితే ముంబై ఇండియన్స్ ఆకాశ్ మద్వాల్‌కు అవకాశం కల్పించింది. ఇక టాస్ సమయంలోనూ రోహిత్ అభిమానులు.. హార్దిక్ పాండ్యాను గేలి చేసారు. రోహిత్.. రోహిత్ అంటూ గట్టిగా నినాదాలు చేశారు.
తుది జట్లు:
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, నమన్ ధిర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టీమ్ డేవిడ్, గెరాల్డ్ కోయిట్జీ, పియూష్ చావ్లా, ఆకాశ్ మద్వాల్, క్వెనా మఫక, జస్‌ప్రీత్ బుమ్రా
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్‌మైర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆవేశ్ ఖాన్, నండ్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్.