For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs RR: అందుకే మూడు మార్పులు చేశాం: హార్దిక్ పాండ్యా

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపత్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా తెలిపాడు. ముంబై ఇండియన్స్ తరఫున 100వ మ్యాచ్ ఆడుతుండటంపై హార్దిక్ సంతోషం వ్యక్తం చేశాడు.

'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. గత కొన్ని మ్యాచ్‌ల్లో డ్యూ ఏ మాత్రం ప్రభావం చూపలేదు. అందుకే ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాను. ముంబై ఫ్రాంచైజీ తరఫున 100వ మ్యాచ్ ఆడుతుండటం సంతోషంగా ఉంది. ముంబై ఇండియన్స్‌తోనే నా కెరీర్ మొదలైంది.

MI vs RR Hardik Pandya Reveals The Reason Why Mumbai Indians Changed Playing XI vs Rajastan

ఆ జట్టు తరఫున 100వ మ్యాచ్ పూర్తి చేసుకోవడం గొప్పగా ఉంది. ఈ మ్యాచ్‌కు మేం మూడు మార్పులు చేశాం. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. నువాన్, వదేరా, పియూష్ చావ్లా తుది జట్టులోకి రాగా.. షెఫర్డ్, మధ్వాల్, శ్రేయస్ గోపాల్ దూరమయ్యారు.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

మరోవైపు తాము టాస్ గెలిచినా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని రాజస్థాన్ రాయల్స్ సారథి సంజూ శాంసన్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. టాస్ ఓడినా మాకు కావాల్సిందే దక్కింది. ఈ టోర్నీ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. చాలా సుదీర్ఘమైన టోర్నీ. మాకు ఐదు రోజుల విశ్రాంతి లభించింది. సరైన ప్రణాళికలను రెడీ చేశాం.

ప్రాసెస్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాం. ఇక్కడ మేం ఎన్నో మ్యాచ్‌లు ఆడాం. వికెట్ ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు. ఈ టోర్నీలో పుంజుకునేందుకు ముంబై బాగా కష్టపడుతోంది. కాబట్టి మేం జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. మా జట్టులోకి సందీప్ శర్మ రాగా.. కుల్దీప్ సేన్ దూరమయ్యాడు.'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్(కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్‌మైర్, రోవ్‌మన్ పోవెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్, నెహల్ వాదేరా, మహమ్మద్ నబీ, గెరాల్డ్ కోయిట్జీ, పియూష్ చావ్లా, జస్‌ప్రీత్ బుమ్రా

Story first published: Monday, April 22, 2024, 19:30 [IST]
Other articles published on Apr 22, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+