రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌ను ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆట పట్టించాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.
ముఖ్యంగా ఆకాశ్ మధ్వాల్ వేసిన 16వ ఓవర్‌లో ఒకే తరహా ఇన్నోవేటివ్ షాట్స్‌తో నాలుగు బౌండరీలు బాదాడు. ఈ నాలుగు బౌండరీలను కూడా థర్డ్ మ్యాన్ రిజీయన్‌లోనే రాబట్టడం విశేషం.

మరోవైపు జస్‌ప్రీత్ బుమ్రా(5/21) నిప్పులు చెరిగినా.. తనకే సాధ్యమైన హిట్టింగ్‌తో ఆర్‌సీబీకి భారీ స్కోర్ అందించాడు. ముఖ్యంగా బుమ్రా వేసిన 19వ ఓవర్‌లో ఆర్‌సీబీ వరుసగా 2 బంతుల్లో 2 వికెట్లు కోల్పోగా.. ఆఖరి బంతిని దినేశ్ కార్తీక్ సిక్సర్‌గా తరలించాడు. ఆ వెంటనే కార్తీక్ దగ్గరకు వచ్చిన రోహిత్ శర్మ.. కార్తీక్‌ను మెచ్చుకుంటూ టీజ్ చేశాడు. రోహిత్ అన్న మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అవ్వడంతో వైరల్‌గా మారాయి.
'శభాష్ రా కార్తీక్.. ప్రపంచకప్ ఆడేందుకే ఇలా చెలరేగుతున్నావ్ కదా'అని టీజ్ చేశాడు. కామెంటేటర్లు సైతం టీ20 ప్రపంచకప్ 2024 జట్టులో చోటు కోసం కార్తీక్ కూడా పోటీ పడుతున్నాడని తెలిపారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్(40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61), రజత్ పటీదార్(26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50), దినేశ్ కార్తీక్(23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 నాటౌట్)హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
ముంబై బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(5/21) నిప్పులు చెరగగా.. గెరాల్డ్ కోయిట్జీ, ఆకాశ్ మధ్వాల్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీసారు.