Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs RCB: బుమ్రా, రోహిత్ రీఎంట్రీ.. అందుకే బౌలింగ్ ఎంచుకున్నా: హార్దిక్

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. డ్యూ ప్రభావం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ చూడటానికి మంచి ట్రాక్‌లా కనిపిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో డ్యూ రావచ్చు. డ్యూ వస్తే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతోంది. అయితే ఇరు జట్ల మధ్య పోరు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది.

ఈ మ్యాచ్‌కు ముందు మాకు కావాల్సిన సమయం లభించింది. ముంబై నగరం ఎప్పుడూ మాకు అండగానే ఉంటుంది. సొంత మైదానంలో ఆడటం ఎప్పుడూ విభిన్నమైన అనుభూతిని కలిగిస్తోంది. మాకు ప్రేక్షకుల అండ ఉంది. ఇక్కడి కండిషన్స్‌పై అవగాహన ఉంది. జస్‌ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ రీఎంట్రీ ఇచ్చారు.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

MI vs RCB IPL 2025 Mumbai Indians to bowl first as Jasprit Bumrah-Rohit Sharma return

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ తెలిపాడు. 'ఇది సాధారణమైన ముంబై వికెట్. బ్యాటింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మంచి క్రికెట్ ఆడటం చాలా ముఖ్యం. ఇక్కడ బౌలింగ్ చేయడం చాలా కష్టం. కానీ మా బౌలింగ్ విభాగంపై నాకు నమ్మకం ఉంది. ఇక్కడ మేం చాలా క్రికెట్ ఆడాం. ప్రతీ వేదికగా ఏం చేయాలో మాకు బాగా తెలుసు. మేం ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నాం.'అని రజత్ పటీదార్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

ఆర్‌సీబీ: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్

ముంబై ఇండియన్స్: విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, విఘ్నేష్ పుతుర్.

Story first published: Monday, April 7, 2025, 19:19 [IST]
Other articles published on Apr 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+