For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs RCB: ఇదెక్కడి షాట్ రా.. మ్యాక్సీ మామ! (వీడియో)

ముంబై: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బిగ్ హిట్టర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్(33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును మ్యాక్సీ.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌తో కలిసి ఆదుకున్నాడు.

మూడో వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. తనకే సాధ్యమైన 360 డిగ్రీల ఆటతో అభిమానులను ఆకట్టునుకున్నాడు. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. తన ట్రేడ్ మార్క్ రివర్స్ స్వీప్, స్వీప్ షాట్లతో సిక్స్‌లు బాది అభిమానులను అలరించాడు.

MI vs RCB: Glenn Maxwell plays most unusual cricket shot goes viral. Jason Behrendorff has broken the 120-run stand between Faf du Plessis & Glenn Maxwell. he has got his third wicket to dismiss Maxwell for 68. Du Plessis is still on the crease after smashing a 29-ball half-century. Behrendorff rattled Royal Challengers Bangalore with two wickets in the powerplay. After dismissing Virat Kohli in the first over, he has removed Anuj Rawat.

ముఖ్యంగా క్రిస్ జోర్డాన్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్‌‌లో ఐదో బంతిని మ్యాక్సీ సిక్స్‌గా మలిచిన తీరు ఈ సీజన్‌కే హైలైట్‌గా చెప్పవచ్చు. గతంలో ఎప్పుడూ చూడని వైవిధ్యమైన షాట్‌తో అలరించాడు. జోర్డాన్ వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ ఫుల్ లెంగ్త్ బాల్‌ను మ్యాక్స్‌వెల్ రివర్స్ స్కూప్ షాట్‌తో థర్డ్ మ్యాన్ దిశగా ఆడి సిక్సర్‌గా మలిచాడు.

ఈ వినూత్నమైన షాట్‌కు మైదానంలో ఉన్న ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లు, నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇదెక్కడి షాట్ రా మ్యాక్సీ మామ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ సీజన్‌కే ఈ షాట్ హైలైట్ అని, గతంలో ఎప్పుడూ ఇలాంటి షాట్ చూడలేదని మ్యాక్సీని కొడియాడుతున్నారు. ప్రస్తుతం ఈ షాట్‌కు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ మ్యాచ్‌లో మ్యాక్సీకి తోడుగా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 199 పరుగులు చేసింది.

చివర్లో దినేశ్ కార్తీక్(18 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 30) మెరుపులు మెరిపించాడు. ముంబై బౌలర్లలో జాసన్ బెహ్రెండార్ఫ్(3/36) మూడు వికెట్లు తీయగా.. కామెరూన్ గ్రీన్, క్రిస్ జోర్డాన్, కుమార్ కార్తీకేయ తలో వికెట్ తీసారు.

Story first published: Tuesday, May 9, 2023, 21:17 [IST]
Other articles published on May 9, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+