Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs RCB: ఫాఫ్, మ్యాక్సీ విధ్వంసం.. ముంబై ముందు భారీ లక్ష్యం!

ముంబై: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బ్యాటర్లు దుమ్మురేపారు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65), గ్లేన్ మ్యాక్స్‌వెల్(33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగారు.

దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 199 పరుగులు చేసింది. చివర్లో దినేశ్ కార్తీక్(18 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 30) మెరుపులు మెరిపించాడు. ముంబై బౌలర్లలో జాసన్ బెహ్రెండార్ఫ్(3/36) మూడు వికెట్లు తీయగా.. కామెరూన్ గ్రీన్, క్రిస్ జోర్డాన్, కుమార్ కార్తీకేయ తలో వికెట్ తీసారు.

Maxwell Brilliance Helps RCB Post Massive Score of 199

శుభారంభం లేదు..:
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. బెహ్రెండార్ఫ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే విరాట్ కోహ్లీ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. అతని మరుసటి ఓవర్‌లో అనూజ్ రావత్(6) కూడా క్యాచ్ ఔటవ్వడంతో ఆర్‌సీబీ 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన గ్లేన్ మ్యాక్స్‌వెల్ భారీ షాట్లతో చెలరేగాడు. దాంతో పవర్ ప్లేలో ఆర్‌సీబీ 2 వికెట్లకు 56 పరుగులు చేసింది.

మ్యాక్సీ విధ్వంసం..:
పవర్ ప్లే అనంతరం మ్యాక్సీకి తోడుగా ఫాఫ్ డుప్లెసిస్ కూడా చెలరేగడంతో ఆర్‌సీబీ స్కోర్ బోర్డు పరుగెత్తింది. 25 బంతుల్లో మ్యాక్స్‌వెల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. 9.3 ఓవర్లలోనే ఆర్‌సీబీ 100 పరుగులు అందుకుంది. ఆ వెంటనే ఫాఫ్ డుప్లెసిస్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది ఈ సీజన్‌లో 6వ అర్థశతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు.

విడదీసిన బెహ్రెండార్ఫ్:
120 పరుగుల భారీ భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని బెహ్రెండార్ఫ్ విడదీసాడు. స్లోయర్ బాల్‌తో మ్యాక్సీని క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మహిపాల్ లోమ్రోర్(1) క్లీన్ బౌల్డ్ అవ్వగా.. ఫాఫ్ డుప్లెసిస్‌ను కామెరూన్ గ్రీన్ పెవిలియన్ చేర్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా కేదార్ జాదవ్ బరిలోకి దిగగా.. దినేశ్ కార్తీక్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు.

అతనిచ్చిన సునాయస క్యాచ్‌ను గ్రీన్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో కార్తీక్ మరింత ధాటిగా ఆడాడు. చివరకు క్రిస్ జోర్డాన్ అతన్ని స్లోయర్ బాల్‌‌తో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన వానిందు హసరంగా రెండు బౌండరీలు బాదగా.. కేదార్ జాదవ్ ఆచితూచి ఆడటంతో ఆర్‌సీబీ 199 పరుగులు చేయగలిగింది.

Story first published: Tuesday, May 9, 2023, 21:33 [IST]
Other articles published on May 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+