ముంబై: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. ఆర్‌సీబీ ఇన్నింగ్స్ అనంతరం మైదానంలోకి బరిలోకి దిగలేదు. అతని స్థానంలో అనూజ్ రావత్ వికెట్ కీపింగ్ చేశాడు.
దినేశ్ కార్తీక్ అనారోగ్యంతో బాధపడుతుండటంతోనే అనూజ్ రావత్ వికెట్ కీపింగ్ చేసినట్లు తెలుస్తోంది. బ్యాటింగ్ సందర్భంగా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కార్తీక్.. 18 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 30 పరుగులు చేశాడు. కీలక సమయంలో జట్టుకు విలువైన పరుగులు జోడించాడు. అయితే ఔటైన అనంతరం క్రీజులోకి వెళ్లే క్రమంలో దినేశ్ కార్తీక్ వాంతులు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

కార్తీక్ అనారోగ్యానికి గురవ్వడంతోనే అనూజ్ రావత్‌ను తుదిజట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దినేశ్ కార్తీక్ అనారోగ్యానికి గురవ్వడం ఆర్‌సీబీ అభిమానులను కలవరపెడుతోంది. తదుపరి మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉంటాడా? లేదా? అని గందరగోళానికి గురవుతున్నారు. కీలక దశకు చేరిన లీగ్‌లో కార్తీక్ దూరమైతే ఆర్‌సీబీకి తీవ్ర నష్టం జరుగుతుందని కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 199 పరుగులు చేసింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65), గ్లేన్ మ్యాక్స్‌వెల్(33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగారు. చివర్లో దినేశ్ కార్తీక్(18 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 30) మెరుపులు మెరిపించాడు. ముంబై బౌలర్లలో జాసన్ బెహ్రెండార్ఫ్(3/36) మూడు వికెట్లు తీయగా.. కామెరూన్ గ్రీన్, క్రిస్ జోర్డాన్, కుమార్ కార్తీకేయ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ 16.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 200 పరుగులు చేసి 21 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. సూర్యకు తోడుగా నెహాల్ వధేరా(32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 నాటౌట్), ఇషాన్ కిషన్(21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 42) రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో వానిందు హసరంగా, విజయ్ కుమార్ వైశాఖ్ రెండేసి వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.