Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs PBKS Turning Point: కొంపముంచిన సూరీడు.. చిత్తుగా ఓడిన ముంబై!

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతుండగా.. మరోవైపు పంజాబ్ కింగ్స్ తమ జైత్రయాత్ర‌ను కొనసాగిస్తోంది. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది.

మరోసారి పేలవ బ్యాటింగ్, చెత్త ఫీల్డింగ్, పసలేని బౌలింగ్‌తో ముంబై ఇండియన్స్ మూల్యం చెల్లించుకుంది. క్వింటన్ డికాక్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. పవర్ ప్లేలో స్లోగా ఆడటం.. స్లాగ్ ఓవర్లలో వేగంగా పరుగులు చేయకపోవడం ముంబై పతనాన్ని శాసించింది.

సెంచరీ వృథా..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్(60 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 112 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. నమన్ ధీర్(31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/22) మూడు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, శశాంక్ సింగ్ తలో వికెట్ తీసారు.

MI vs PBKS Turning Point Suryakumar Yadav s Golden Duck against Punjab Kings Costs Mumbai Indians Dearly

అనంతరం పంజాబ్ కింగ్స్ 16.3 ఓవర్లలో 3 వికెట్లుకు 198 పరుగులు చేసి గెలుపొందింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(39 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 80 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ముంబై బౌలర్లలో అల్లా గజన్‌ఫర్(2/31) రెండు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్(1/38) ఒక్క వికెట్ తీసాడు. ఈ మ్యాచ్‌లోనూ జస్‌ప్రీత్ బుమ్రా(0/41) ఒక్క వికెట్ తీయలేకపోయాడు.

కొంపముంచిన సూరీడు..

ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. రోహిత్ గైర్హాజరీలో క్వింటన్ డికాక్ ఓపెనర్‌గా బరిలోకి దిగగా.. ఫామ్‌లో ఉన్న ర్యాన్ రికెల్టన్(2) తీవ్రంగా నిరాశపర్చాడు. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ మరుసటి బంతికే సూర్యకుమార్ యాదవ్(0) కూడా క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో ముంబై బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది.

దాంతో పవర్ ప్లేలో 2 వికెట్లకు 48 పరుగులే చేసింది. డికాక్, నమన్ ధీర్ అద్భుత బ్యాటింగ్‌తో నాలుగో వికెట్‌కు 122 పరుగులు జోడించినా.. స్లాగ్ ఓవర్లలో ముంబై దూకుడుగా ఆడలేకపోయింది. డికాక్‌తో పాటు హార్దిక్ పాండ్యా(14), రూథర్‌ఫోర్డ్(1), తిలక్ వర్మ(8) తీవ్రంగా నిరాశపర్చారు. దాంతో ముంబై 195 పరుగులకే పరిమితమైంది. పవర్ ప్లేలో, స్లాగ్ ఓవర్లలో కాస్త దూకుడుగా ఆడి 30-40 పరుగులు అదనంగా చేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది.


బుమ్రా చెత్త ఫీల్డింగ్..

చేసిందే స్వల్ప లక్ష్యం అంటే.. చెత్త ఫీల్డింగ్‌తో ముంబై ఇండియన్స్ మూల్యం చెల్లించుకుంది. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో జస్‌ప్రీత్ బుమ్రా నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో అతను మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో చెలరేగాడు. శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను నమన్ ధీర్ నేలపాలు చేశాడు. ప్రభ్‌సిమ్రాన్ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ కొంత ఉత్కంఠగా మారేది.

Story first published: Thursday, April 16, 2026, 23:20 [IST]
Other articles published on Apr 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+