MI vs LSG: ఆ తప్పిదంతోనే ఘోర పరాభవం: హార్దిక్ పాండ్యా
ఈ సీజన్‌లో తమ జట్టు నాణ్యమైన క్రికెట్ ఆడలేదని, దాంతోనే తమకు ఘోర పరాభవం ఎదురైందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో వాంఖడే వేదికగా శుక్రవారం జరిగిన తమ ఆఖరి మ్యాచ్‌లోనూ ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. చెత్త ఆటతో 18 పరుగుల తేడాతో చిత్తయ్యింది.
దాంతో ఈ సీజన్‌ను ఓటమితో ముగించింది. మొత్తం 14 మ్యాచ్‌లకు 4 మాత్రమే గెలిచిన ముంబై ఇండియన్స్.. పది పరాజయాలతో అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఘోర పరాజయంపై స్పందించిన హార్దిక్ పాండ్యా.. ఈ సీజన్ చాలా కఠినంగా గడిచిందన్నాడు.

'ఈ సీజన్ చాలా కష్టంగా గడిచింది. మేం క్వాలిటీ ఆఫ్ క్రికెట్ ఆడలేదు. అదే మా విజయవకాశాలను దెబ్బతీసింది. ప్రొఫెషనల్ క్రికెట్‌లో కొన్నిసార్లు కలిసి వస్తే.. మరికొన్ని సార్లు ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సీజన్‌లో మేం జట్టుగా మంచి క్రికెట్ ఆడలేదు. తెలివిగా వ్యవహారించలేదు. దాంతోనే మాకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి.
ఈ మ్యాచ్‌లో జరిగిన తప్పిదం ఏంటో ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతోంది. వీలైనంత త్వరగా ఈ మ్యాచ్‌ను మరిచి అప్‌కమింగ్ సీజన్‌పై ఫోకస్ పెడుతాం.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55), నికోలస్ పూరన్(29 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 75) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఆయుష్ బదోని(10 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 22 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ముంబై బౌలర్లలో నువాన్ తుషారా(3/28), పియూష్ చావ్లా(3/29) మూడేసి వికెట్లు తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులకే పరిమితమైంది. ఇంపాక్ట్ ప్లేయర్ రోహిత్ శర్మ(38 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 68), నమన్ ధిర్(26 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్, రవి బిష్ణోయ్ రెండేసి వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా, మోహ్‌సిన్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications