Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs LSG: నికోలస్ పూరన్‌కు భయపడ్డ అర్జున్ టెండూల్కర్(వీడియో)

లక్నో సూపర్ జెయింట్స్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్‌కు ముంబై ఇండియన్స్ యువ పేసర్, సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ భయపడ్డాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో శుక్రవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ బరిలోకి దిగాడు.

జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో బరిలోకి దిగిన అతను.. పవర్ ప్లేలో రెండు ఓవర్లను కట్టడి బౌలింగ్ చేశాడు. రెండు ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇందులో ఒకే ఒక్క బౌండరీ ఉంది. ముఖ్యంగా తన తొలి ఓవర్‌లో నికోలస్ పూరన్‌ను ఔట్ చేసినంత పని చేశాడు. కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు.

MI vs LSG Fans reactions after Arjun Tendulkar leaves the over midway after consecutive sixes from Nicholas Pooran

రెండో ఓవర్‌లో ఓ బౌండరీతో 7 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక మిడిల్ ఓవర్లలో మూడో ఓవర్ వేసిన అర్జున్ టెండూల్కర్.. నికోలస్ పూరన్ విధ్వంసానికి వరుసగా రెండు బంతుల్లో రెండు సిక్స్‌లు సమర్పించుకున్నాడు. మూడో బంతి వేసే సమయంలో అతని పిక్క కండరాలు పట్టేయడంతో మైదానం వీడాడు.

అయితే పూరన్ విధ్వంసానికి భయపడే అర్జున్ టెండూల్కర్ మైదానం వీడాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కావాలనే గాయం అనే సాకుతో అర్జున్ టెండూల్కర్ డకౌట్‌కు పరిమితమయ్యాడని, పూరన్‌కు భయపడ్డాడని సెటైర్లు పేల్చుతున్నారు. పూరన్ 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొడతాడని భయపడ్డాడేమోనని జోకులు పేల్చుతున్నారు. సచిన్ కొడుకు 2 సిక్స్‌లకే వెనకడుగు వేస్తే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55), నికోలస్ పూరన్(29 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 75) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఆయుష్ బదోని(10 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 22 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ముంబై బౌలర్లలో నువాన్ తుషారా(3/28), పియూష్ చావ్లా(3/29) మూడేసి వికెట్లు తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్.. 3.5 ఓవర్లలో 33 పరుగులు చేయగా.. ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ తిరిగిన ప్రారంభమైనా.. వర్షం కారణంగా దాదాపు 30 నిమిషాలు ఆట ఆగిపోయింది.

Story first published: Friday, May 17, 2024, 23:01 [IST]
Other articles published on May 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+