Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs KKR: శతక్కొట్టిన వెంకటేశ్ అయ్యర్.. ముంబై ముందు భారీ లక్ష్యం

ముంబై: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్(51 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లతో 104) సెంచరీతో చెలరేగాడు. కేకేఆర్ తరఫున సెంచరీ అందుకున్న రెండో బ్యాటర్‌గా నిలిచాడు.

దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 185 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్‌కు తోడుగా ఆండ్రీ రస్సెల్ (11 బంతుల్లో 3 ఫోర్లు వికెట్‌తో 21 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ముంబై బౌలర్లలో హృతిక్ షోకీన్ రెండు వికెట్లు తీయగా.. కామెరూన్ గ్రీన్, డాన్ జాన్సెన్, పియూష్ చావ్లా, రీలే మెరిడిత్ తలో వికెట్ తీసారు.

Venkatesh Iyer Century help Kolkata Knight

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు రెహ్మానుల్లా గుర్బాజ్(8), నారయణ్ జగదీషణ్(0) మరోసారి దారుణంగా విఫలమయ్యారు. ఓవైపు వికెట్లు పడ్డా మరోవైపు వెంకటేశ్ అయ్యర్.. ధాటిగా ఆడాడు. దాంతో పవర్ ప్లేలో కేకేఆర్ 2 వికెట్లకు 57 పరుగులు చేసింది. నితీష్ రాణా(5) విఫలమైనా.. వెంకటేశ్ తనదైన బ్యాటింగ్‌తో 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఓవైపు శార్దూల్ ఠాకూర్(13), రింకూ సింగ్(18) విఫలమైనా మరోవైపు వెంకటేశ్ అయ్యర్ చెలరేగాడు. తానే ఎక్కువగా స్ట్రైక్ తీసుకుంటూ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 49 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న అతను మెరిడిత్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన ఆండ్రీ రస్సెల్.. సునీల్ నరైన్‌(2)తో కలిసి జట్టు స్కోర్‌ను 180 పరుగుల మార్క్‌ను ధాటించాడు.

Story first published: Sunday, April 16, 2023, 17:38 [IST]
Other articles published on Apr 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+