ముంబై: కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన వెంకటేశ్ అయ్యర్((51 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లతో 104).. కేకేఆర్ తరఫున సెంచరీ బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.
15 ఏళ్ల తర్వాత కేకేఆర్ తరఫున ఓ బ్యాటర్ సెంచరీ చేయడం గమనార్హం. అరంగేట్ర ఐపీఎల్ సీజన్‌లో బ్రెండన్ మెక్‌కల్లమ్ కేకేఆర్ తరఫున తొలి సెంచరీ బాదాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరిగిన నాటి మ్యాచ్‌లో మెక్‌కల్లమ్ 73 బంతుల్లో 158 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఇక అప్పటి నుంచి మరే కేకేఆర్ బ్యాటర్ కూడా సెంచరీ సాధించలేదు.

తాజాగా వెంకటేశ్ అయ్యర్ ఈ ఘనతను అందుకొని 15 ఏళ్ల తర్వాత కేకేఆర్ తరఫున సెంచరీ బాదిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వెంకటేశ్ అయ్యర్ మొకాలికి బంతి బలంగా తాకగా.. నొప్పితో అతను విలవిలలాడాడు. ఆ బాధతో చెలరేగిన వెంకటేశ్ అయ్యర్... ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
51 బంతుల్లోనే 104 పరుగులు చేసి జట్టు 185 పరుగుల భారీ స్కోర్ అందించాడు. వెంకటేశ్ అయ్యర్ ఒక్కడే 104 పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లంతా కలిసి 81 పరుగులు మాత్రమే చేశారు. వెంకటేశ్ తర్వాత ఆండ్రీ రస్సెల్(21 నాటౌట్) అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో కేకేఆర్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన రెండో బ్యాటర్‌గా వెంకటేశ్ అయ్యర్ నిలిచాడు.
తన అరంగేట్ర సీజన్ నుంచి ముంబై ఇండియన్స్‌పై వెంకటేశ్ అయ్యర్ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ 2021 సీజన్‌లో కేకేఆర్ తరఫున క్యాష్‌రిచ్ లీగ్‌లోకి అరంగేట్రం చేసిన వెంకటేశ్ అయ్యర్.. ముంబైపై 30 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. గత సీజన్‌లో రెండు మ్యాచ్‌ల్లోనూ(50 నాటౌట్(41), 43(24)) అద్భుతంగా రాణించాడు. ఈ ఏడాది ఏకంగా సెంచరే సాధించాడు.