Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs KKR: బసిల్ థంపీ ఔట్.. సూర్యకుమార్ డౌట్! కేకేఆర్‌తో బరిలోకి దిగే ముంబై జట్టు ఇదే!

 MI vs KKR: Suryakumar Yadav Doubt, Jaydev Unadkat likely to replace Basil Thampi

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుస పరాజయాలతో డీలా పడ్డ ఫైవ్ టైమ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. గత సీజన్ రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బుధవారం పుణే వేదికగా జరగనున్న మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన రోహిత్ సేన.. కేకేఆర్‌తోనైనా విజయం సాధించి లీగ్‌లో బోణీ కొట్టాలనుకుంటుంది. మరోవైపు మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో కొనసాగుతున్న కేకేఆర్ జోరు మీదుంది. దాంతో ఇరు జట్ల మధ్య జరిగే పోరు మరింత ఆసక్తికరంగా ఉండనుంది.

 బలహీనంగా ముంబై..

బలహీనంగా ముంబై..

తమకు అలవాటైన రీతిలోనే పేలవ ఆరంభం అందుకున్న ముంబై ఇండియన్స్ గతంలో కంటే బలహీనంగా కనిపిస్తోంది. మెగా వేలం కారణంగా బిగ్ ప్లేయర్స్ సేవలను కోల్పోయి ఆ జట్టు.. అనే సమస్యలతో సతమతమవుతుంది. పాండ్యా బ్రదర్స్ లేకపోవడంతో మిడిలార్డర్ బలహీనంగా ఉంది. లోయరార్డర్‌లో పొలార్డ్ మినహా మరో చెప్పుకోదగ్గ హిట్టర్ లేడు. బౌలింగ్‌లో బుమ్రాకు అండగా నిలిచే మరో బౌలర్ కనిపించడం లేదు. అయితే తమ భారీ ప్యాకెజ్ స్టార్ ఇషాన్ కిషన్(రూ.15.25 కోట్లు) మాత్రం సూపర్ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. అతను రెండు మ్యాచ్‌ల్లో వరుసగా హాఫ్ సెంచరీలు బాదాడు. ఇక యువ కెరటం తిలక్ వర్మ చెలరేగుతుండటం కూడా ముంబైకి కొండంత అండ. అందరూ కలిసికట్టుగా రాణిస్తే కేకేఆర్‌‌పై ముంబై విజయం సాధించగలదు.

 సూర్యకుమార్ డౌట్..

సూర్యకుమార్ డౌట్..

రెండు వరుస ఓటములతో ముంబై జట్టులోని లుకలుకలు బయటపడటంతో టీమ్ కాంబినేషన్ మార్చాల్సిన పరిస్థితి అనివార్యమైంది. సూర్యకుమార్ యాదవ్ గాయం ఆ జట్టును వెంటాడుతోంది. అతని గాయంపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో కేకేఆర్‌తో మ్యాచ్ ఆడటంపై కూడా సందేహాలు నెలకొన్నాయి. పైగా రాజస్థాన్‌తో మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. ఫింగర్ ఇంజ్యూరిస్ చాలా క్లిష్టమైనవని, రోహిత్‌కు తగిన సమయం ఇవ్వాలనుకుంటామని చెప్పాడు. అతను ఎప్పుడు ఫిట్ అయితే అప్పుడు జట్టులోకి వస్తాడని చెప్పాడు. దీని బట్టి గాయం నుంచి పూర్తిగా కోలుకుంటే సూర్య తుది జట్టులోకి రానున్నాడు. అప్పుడు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన అన్‌మోల్ ప్రీత్ సింగ్‌పై వేటు పడనుంది.

 బసిల్ థంపిపై వేటు..

బసిల్ థంపిపై వేటు..

ఇక రాజస్థాన్ రాయల్స్‌తో ధారళంగా పరుగులిచ్చుకున్న బసిల్ థంపిపై కూడా వేటు పడటం ఖాయం. జోస్ బట్లర్ విధ్వంసంతో అతను ఒకే ఓవర్‌లో 26 పరుగులిచ్చుకున్నాడు. ఈనేపథ్యంలోనే అతన్ని పక్కనపెట్టి జయదేవ్ ఉనాద్కత్‌ను ఆడించే అవకాశం ఉంది. ఇక మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. పొలార్డ్, టీమ్ డేవిడ్, డానియల్ సామ్స్, బుమ్రా, టైమల్ మిల్స్ కొనసాగనున్నారు. పుణే పిచ్ ఆరంభంలో బ్యాటర్లకు అనుకూలించి.. ఆ తర్వాత స్పిన్నర్లుగా అడ్వాంటేజ్‌గా మారుతుంది. ఈ లెక్కన ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను తీసుకునే చాన్సుంది.

 ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా)

ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా)

ఇషాన్ కిషన్(కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), అన్‌మోల్‌ప్రీత్ సింగ్/సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, టీమ్ డేవిడ్, డానియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, జయదేవ్ ఉనాద్కత్

Story first published: Tuesday, April 5, 2022, 18:50 [IST]
Other articles published on Apr 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+