టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్ కోసం సన్నాహకాలు ప్రారంభించాడు. మెగా టోర్నీలో ఫ్రెష్‌గా బరిలోకి దిగేందుకు హిట్ మ్యాన్ వర్క్‌లోడ్‌పై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తుది జట్టు నుంచి తప్పుకున్నాడు.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడేందుకు సిద్దమయ్యాడు. కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసేందుకు రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాంఖడే మైదానం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు.

తుది జట్టులో ఒక్క మార్పు చేసిన ముంబై ఇండియన్స్ మహమ్మద్ నబీ స్థానంలో నమన్ ధీర్‌ను తీసుకుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై ఇండియన్స్.. కేవలం పరువు కోసమే ఆడుతోంది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ.. టీ20 ప్రపంచకప్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ చివరి లీగ్ మ్యాచ్‌లకు కూడా దూరమయ్యే అవకాశం ఉంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. నువాన్ తుషారా(3/25) ధాటికి కోల‌్‌కతా నైట్‌రైడర్స్ 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఫిల్ సాల్ట్(5), రఘువంశీ(13), శ్రేయస్ అయ్యర్(6)లను నువాన్ తుషారా పెవిలియన్ చేర్చగా.. సునీల్ నరైన్‌ను హార్దిక్ పాండ్యా క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులో రింకూ సింగ్‌తో పాటు వెంకటేశ్ అయ్యర్ ఉన్నారు.
తుది జట్లు:
కేకేఆర్: ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్, అంగ్‌క్రిష్ రఘు వంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తీ.
ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, టీమ్ డేవిడ్, గెరాల్డ్ కోయిట్జీ, పియూష్ చావ్లా, జస్‌ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార