Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs KKR: రోహిత్ శర్మ చెత్త రికార్డు!

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ చెత్త రికార్డ్ నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే బౌలర్ చేతిలో అత్యధిక సార్లు ఔటైన బ్యాటర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో రోహిత్ ఈ చెత్త ఫీట్ నమోదు చేశాడు.

ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ(11) సునీల్ నరైన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. సునీల్ నరైన్‌ బౌలింగ్‌లో రోహిత్ ఔటవ్వడం ఇది 8వ సారి. మరే బ్యాటర్ కూడా ఇన్నిసార్లు ఒకే బౌలర్ చేతిలో ఔటవ్వలేదు.

MI vs KKR Rohit Sharma creates unwanted record after getting out against Sunil Narine

ఈ జాబితాలో రోహిత్ టాప్‌లో ఉండగా.. జహీర్ ఖాన్ బౌలింగ్ ధోనీ , సందీప్ శర్మ చేతిలో విరాట్ కోహ్లీ, మోహిత్ శర్మ చేతిలో అంబటి రాయుడు, అమిత్ మిశ్రా చేతిలో రోహిత్ శర్మ, అశ్విన్ బౌలింగ్‌లో ఊతప్ప, బుమ్రా బౌలింగ్‌లో రిషభ్ పంత్, భువనేశ్వర్ కుమార్ చేతిలో అజింక్యా రహానే ఏడుసార్లు చొప్పున ఔటయ్యారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. వెంకటేశ్ అయ్యర్(52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీతో రాణించగా.. మనీష్ పాండే(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై బౌలర్లలో నువాన్ తుషారా, జస్‌ప్రీత్ బుమ్రా మూడేసి వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. పియూష్ చావ్లాకు ఓ వికెట్ దక్కింది.

Story first published: Friday, May 3, 2024, 22:57 [IST]
Other articles published on May 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+